బిజినెస్

ఎట్టకేలకు ఒక్కటయ్యాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: ఎట్టకేలకు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీనానికి కేంద్ర ప్రభుత్వం గురువారం తుది ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థలు విలీనం తరువాత దేశంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించనున్నాయి. ఈ విలీనంతో ఏర్పడుతున్న కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ దేశంలో 35 శాతం వాటాతో సుమారు 430 మిలియన్ ఖాతాదారులను కలిగి ఉంటుంది. 344 మిలియన్ ఖాతాదారులతో ప్రస్తుతం దేశంలో అతి పెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఉన్న భారతి ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెడుతుంది. గత కొంతకాలంగా సాగుతున్న వొడాఫోన్, ఐడియా సెల్యులార్ విలీన ప్రక్రియతో సంబంధం ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ)లోని ఒక సీనియర్ అధికారి ప్రభుత్వం విలీనానికి తుది ఆమోదం తెలిపిన విషయాన్ని ధ్రువీకరించారు. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థలు ఇప్పుడు విలీనానికి సంబంధించి తాము పొందిన వివిధ ఆమోదాల గురించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ (ఆర్‌ఓసీ)కు తెలియజేసి, విలీన ప్రక్రియలో మిగిలి ఉన్న చివరి అంకాన్ని పూర్తి చేయవలసి ఉంది. వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌ల విలీనంతో ఏర్పడుతున్న కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ టెలికం ట్రిబ్యునల్, ఇతర న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది. డీఓటీ జూలై తొమ్మిదో తేదీన వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీల విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. అధికారికంగా విలీనం కావాలంటే పెండింగ్‌లో ఉన్న లాంఛనాలు పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా సంయుక్తంగా ఈ వారం మొదట్లో ప్రభుత్వానికి ‘అండర్ ప్రొటెస్ట్’ కింద రూ. 7,268.78 కోట్లు చెల్లించాయి. ఇందులో రూ. 3,926.34 కోట్లు నగదు రూపంలో చెల్లించగా, రూ. 3,342.44 కోట్లు బ్యాంకు గ్యారంటీగా సమకూర్చాయి. విలీనం తరువాత కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ 23 బిలియన్ డాలర్ల (రూ. 1.5 లక్షల కోట్లకు పైగా) విలువతో 35 శాతం మార్కెట్ వాటా, 430 మిలియన్ ఖాతాదారులతో దేశంలోనే అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఆవిర్భవిస్తుంది. కుమార్ మంగళం బిర్లా ఈ కొత్త సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
బాలేశ్ శర్మ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా వ్యవహరిస్తారు. ఉమ్మడి కొత్త సంస్థలో వొడాఫోన్ 45.1 శాతం వాటాను, ఆదిత్య బిర్లా గ్రూప్ 26 శాతం వాటాను, ఐడియా షేర్‌హోల్డర్లు 28.9 శాతం వాటాను కలిగి ఉంటారు.