బిజినెస్

నాలుగో రోజూ అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 26: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా నాలుగో రోజు గురువారం సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటు ప్రపంచ పరిణామాలు సానుకూలంగా ఉండటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. సెనె్సక్స్ చరిత్రలో తొలిసారి గురువారం ఇంట్రా-డేలో కీలకమయిన 37,000 మార్కును అధిగమించి 37,061.62 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 126.41 పాయింట్ల (0.34 శాతం) ఎగువన 36,984.64 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం సృష్టించిన ముగింపు రికార్డు 36,858.23 పాయింట్ల స్థాయిని అధిగమించింది. ఈ సూచీ ఇప్పటి వరకు వరుసగా నాలుగు రోజుల్లో కలిపి 507 పాయింట్లు పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా గురువారం ఇంట్రా-డే హై 11,185.85 పాయింట్లకు చేరింది. అయితే చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 35.30 పాయింట్ల (0.32 శాతం) ఎగువన సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,167.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. జూలై 24నాటి గరిష్ఠ స్థాయి ముగింపు రికార్డును ఈ సూచీ అధిగమించింది. జూలై 24న ఈ సూచీ 11,134.30 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నిరంతరాయంగా కొనుగోళ్లు జరపడంతో పాటు ఇండెక్స్‌లోని కొన్ని సంస్థలు తొలి త్రైమాసికంలో అంచనాలను మించి ఆదాయాలు ఆర్జించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసిందని విశే్లషకులు పేర్కొన్నారు. జూలై నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియడంతో మదుపరులు తమ పెండింగ్ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడటానికి దోహదపడిందని వారు వివరించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ తమ సంప్రదింపులలో వాణిజ్య వివాదంలోకి ఇనుమును తేవొద్దనే అంగీకారానికి రావడంతో యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా బలపడ్డాయి. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) బుధవారం నికరంగా రూ. 97.64 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 1,195.75 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థలలో ఎస్‌బీఐ గురువారం అత్యధికంగా 5.62 శాతం లాభపడింది.