బిజినెస్

పరస్పరం టెక్నాలజీ మార్పిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహెన్స్‌బర్గ్, జూలై 26: పారిశ్రామిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంతో స్వావలంభనకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ ఆయన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల సదస్సులో ప్రసంగిస్తూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులపై బ్రిక్స్ దేశాలు పరస్పరం అందించుకోవాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్, పారిశ్రామిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. సమాజంలో సమృద్ధిగా ఉద్యోగావకాశాలు పెంపొందించాలంటే పారిశ్రామికాభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తయారీ రంగంలో ఉత్పత్తులను పెంచడం, వాటిని నిర్దేశించిన గమ్యాలకు సకాలంలో చేర్చడం, వినియోగదారులకు సకాలంలో అందించేందుకు టెక్నాలజీ సహకరిస్తుందన్నారు. మెరుగైన సమాజం సృష్టించాలంటే ఉన్నత ప్రమాణాలతో కూడిన టెక్నాలజీని ప్రతి దేశం సమకూర్చుకోవాలన్నారు. బ్రిక్స్ దేశాలతో కలిసి భారత్ పని చేస్తుందన్నారు. తమ దేశాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు సుపరిపాలన అందించేందుకు తీసుకుంటున్న విధానాలు, అనుభవాలను బ్రిక్స్ దేశాలు పంచుకోవాలన్నారు. 18వ శతాబ్ధంలో తొలి పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని, ప్రస్తుతం నాల్గవ పారిశ్రామిక విప్లవంలో ప్రపంచం తీవ్రమైనమార్పులకు లోనవుతోందన్నారు. విద్య, పరిశ్రమల మధ్య అనుసంధానం ఉండాలన్నారు. ఆర్థికంగా ప్రజలు మెరుగైన జీవన విధానాన్ని గడిపేందుకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రపంచదేశాల్లో అణగారిన వర్గాలకు టెక్నాలజీ వరమని, ఉన్నత స్థాయిలో రాణించేందుకు దోహదపడుతోందన్నారు. నాల్గవ పారిశ్రామిక విప్లవం వల్ల వస్తున్న ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ఆయన కోరారు. బ్రిక్స్ దేశాలతో కలిసి పారిశ్రామిక, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడిగా పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ప్రతిదేశంలో టెక్నాలజీతో పాటు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు చట్టాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. చట్టానికి లోబడి వ్యవస్థలు, ప్రజలు నడుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక రంగంలో వ్యక్తులకు ప్రభుత్వ స్కీంల ఫలాలు అందాలంటే, సామాజిక భద్రత పెంచాలంటే నేరుగా చెల్లింపుల టెక్నాలజీని అమలు చేయాల్సిందేనన్నారు. ఈ తరం పారిశ్రామిక విప్లవంలో పెట్టుబడులకు కొరత లేదని, కాని వాటి ఫలాలను సద్వినియోగం చేసుకోవడంపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. ఉద్యోగాల కల్పనలో స్థిరత్వం ఉండాలన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి, డిజైన్, తయారీ రంగం మధ్య సమతుల్యత ఉండాలన్నారు.