బిజినెస్

హడ్కో, ఎన్‌బీసీసీ వాటాల విక్రయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలయిన హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్ నుంచి పది శాతం చొప్పున వాటాలను విక్రయించడానికి కసరత్తు చేస్తోంది. అలాగే ఎన్‌టీపీసీ నుంచి మూడు శాతం వాటాను విక్రయించడానికి పూనుకుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా ఈ వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 5,900 కోట్లు సమకూరుతాయి. హడ్కో, ఎన్‌బీసీసీలలోని వాటాల విక్రయ ప్రక్రియను నిర్వహించేందుకు మర్చంట్ బ్యాంకర్స్ నియామకానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ)ని జారీ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘క్యాబినెట్ ఎన్‌బీసీసీ, హడ్కోలోని పది శాతం చొప్పున వాటాలను ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించడానికి ఆమోదం తెలిపింది. ఇనె్వస్టర్ల నుంచి వచ్చే స్పందనను బట్టి ఈ వాటాలను ఒకేసారి విక్రయించాలా? లేదా? అనేది నిర్ణయించడం జరుగుతుంది’ అని ఆ వర్గాలు ఒక వార్తాసంస్థకు చెప్పాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం హడ్కోలోని పది శాతం వాటా అమ్మకం ద్వారా రూ. వెయ్యి కోట్లు, ఎన్‌బీసీసీలోని పది శాతం వాటా విక్రయం ద్వారా రూ. 1,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి. అలాగే ఎన్‌టీపీసీలోని మూడు శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ. 3,700 కోట్లు సమకూరుతాయి. విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీలోని పది శాతం వాటా విక్రయానికి కేంద్ర క్యాబినెట్ ఇదివరకే ఆమోదం తెలపగా, అందులోని ఏడు శాతం వాటాను నిరుడు ఆగస్టులో విక్రయించారు. ఆ వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 9,100 కోట్లు సమకూరాయి. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ వాటాల విక్రయం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.