బిజినెస్

ఐటీ రిటర్న్ గడువు ఆగస్టు 31వరకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసే గడువును పెంచారు. తాజా నిర్ణయం ప్రకారం ఆగస్టు 31వ తేదీ వరకూ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని ఆదాయ పన్ను శాఖ కమిషనర్ డాక్టర్ దీపక్ పీ. రిపొటే తెలిపారు. అందరి మేలు కోసమే వినియోగించడం జరుగుతుందని, దేశ అభివృద్ధికి, పురోభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని దీపక్ చెప్పారు. ఐటీ శాఖపై ఉన్న దురభిప్రాయం పోగొట్టి ఈ విభాగం కేవలం పర్యవేక్షణకే కాకుండా దేశాభివృద్ధికీ దోహదం చేస్తుందనే సందేశాన్నిచ్చేందుకు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఆదాయపన్ను శాఖపై అవగాహన కల్పిస్తున్నామని, ఐటీ విషయమై ఎవరికీ ఎలాంటి భయాలు అక్కర్లేదని అన్నారు. సకాలంలో తమ ఆదాయాన్ని బహిర్గతపరిచి దానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పన్ను సకాలంలో చెల్లిస్తే ఏమీ ఇబ్బంది లేదని, అన్నీ తెలిసి తమ ఆదాయాన్ని గోప్యంగా ఉంచేవారికి మాత్రం సమస్యలు తప్పవని దీపక్ స్పష్టం చేశారు. మార్వాడి శిక్షా సమితి ఏర్పాటు చేసిన చైతన్య కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకూ ఐటీ ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోందని, దానికి కారణం జీవనప్రమాణాలు పెరగడంతో పాటు వ్యక్తిగత ఆదాయం కూడా పెరగడమేనని అన్నారు. తమ శాఖపై
ప్రజల ఆలోచనా దృక్పథం మారాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి అవసరమైన సకల సౌకర్యాలను కల్పించడం వెనుక ఆదాయపన్ను శాఖ ఆదాయం కూడా ఉందని గుర్తుచేశారు. అలాగే ఆదాయపన్ను వసూలు, చెల్లింపులకు అనేక మినహాయింపులు, రాయితీలు కూడా ఉన్నాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలకు లోబడి కార్యకలాపాలు నిర్వహించే సేవా సంస్థలకు లభించే ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదని, ఎక్కువ మంది సేవా సంస్థలు ఏర్పాటు చేసి సేవలు అందించడం వల్ల మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డీవీజీ కృష్ణ అధ్యక్షత వహించగా, సొసైటీ అధ్యక్షుడు కమల్ నారాయణ్ అగర్వాల్, కార్యదర్శి సురేంద్ర లూనియా, జాయింట్ సెక్రటరీ ఎస్‌బీ కాబ్రా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఐటీ కమిషనర్లు పవన్‌కుమార్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు ఐటీశాఖ పనితీరును వివరించారు.
ఇలావుంటే, రిటర్న్స్ గడువును సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టు టాక్సెస్ పొడిగించింది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జూలై 31లోగా ఆదాయపన్ను రిటర్న్స్‌ను సమర్పించాల్సి ఉండగా, 1961 ఆదాయపన్ను శాఖ సెక్షన్ 119 కింద అధికారాలను వినియోగించి రిటర్న్స్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించినట్టు అండర్ సెక్రటరీ ఆర్ రాజరాజేశ్వరి తెలిపారు. తుది గడువు పొడిగించాలని పలు సంస్థలు విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది గడువులోగా ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయకుంటే జరిమానా తప్పదని ఇప్పటికే ఐటీ శాఖ ప్రకటించింది.