బిజినెస్

అన్ని ప్రాంతాలకూ అందుబాటులో విమానయానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయ విమానయాన అభివృద్ధిలో భాగంగా విమానాలు, హెలికాప్టర్‌లు అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో వెల్లడించారు. పౌరుల ప్రయాణానికి అనువైన విమానాల తయారీని దేశంలోనే తయారు చేసే ప్రతిపాదన ఏమన్నా ప్రభుత్వం వద్ద ఉందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్‌లో మనది ఒకటని అన్నారు. ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా వివిధ విమానయాన సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది మే 18న జరిగిన సమావేశంలో నేషనల్ సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ (ఎన్‌సిఏడి) కింద రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్ (ఆర్‌టిఏ)ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల మేరకు తగు చర్యలు ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. అయితే దానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించ లేదు. అంతేకాకుండా ప్రయాణికుల విమానాలు, హెలికాప్టర్‌లు, విమాన స్పేరుపార్టులు తయారీని భారత్‌లో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. దేశీయ విమానయాన రంగంలో గత నాలుగేళ్ల కంటే రెట్టింపు ప్రగతిని సాధించినట్టు ఆయన చెప్పారు. కాగా, ఎన్‌సిఏడి కార్యక్రమం కింద బెంగళూరులో 90సీట్ల విమానాల తయారీ, డిజైన్, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు మార్చి 2017న కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి వెల్లడించిన విషయం విదితమే. ఈ కార్యక్రమం కింద 7,55 కోట్లను కేటాయిస్తారు. ఇందులో 4355 కోట్లు డిజైన్, డెవలప్‌మెంట్‌కు, 3200 కోట్లు ఉత్పత్తికి కేటాయిస్తారు.