బిజినెస్

భారత్‌లో పెట్టుబడులకు యుఏఈ సంసిద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన దేశంలో 75 బిలియన్ డాలర్లతో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హామీ ఇచ్చిందని, ఈ మేరకు వివిధ ఒప్పందాలు ఖరారయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఆసక్తిని కనపరుస్తోందని చెప్పేందుకు ఇది నిదర్శనమని పేర్కొంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపింది. భారత్‌కు ఆర్థిక రంగంలో పెట్టుబడుల్లో యుఏఈ మూడో అతి పెద్ద భాగస్వామి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంతవరకు 5.3 బిలియన్ డాలర్లను అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టిందన్నారు. ఇనె్వస్ట్ ఇండియా, ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశారు. దీనివల్ల ఇరుదేశాలకు వచ్చే దశాబ్ధ కాలంలో 20 బిలియన్ డాలర్ల ప్రయోజనం చేకూరుతుంది. బ్లాక్ చైన్, ఏ1, అనలిటిక్స్, డాటాప్రోసెసింగ్, వాణిజ్య రంగంలో వినూత్న అవకాశాల అభివృద్ధికి ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. 2035 నాటికి అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడులు 957 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయన్నారు.