బిజినెస్

ఎగుమతిదారులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ఎగుమతిదారులకు శుభవార్త. ఎగుమతుల రంగంలో పోస్టు లేదా కొరియర్ సర్వీసు ద్వారా రూ.5 లక్షల విలువైన వస్తువులను పంపే సదుపాయాన్ని కల్పించినట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. ఇంతకాలం ఈ రెండు సర్వీసుల ద్వారా పంపే వస్తువుల గరిష్ట విలువ రూ.25వేలకు మించి ఉండరాదు. దేశంలో ఎగుమతిదారులు, ప్రజలు చాలా కాలం నుంచి ఈ విధానాన్ని సమీక్షించాలని కోరుతున్నారు. ఈ-కామర్స్ కంపెనీలు కూడా కొరియర్, పోస్టు ద్వారా పంపే వస్తువుల విలువను సమీక్షించాలని ప్రభుత్వంపై వత్తిడి పెంచారు. ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆహ్వానించింది. ఇతర దేశాలకు ఎగుమతుల ఊపందుకుంటాయని ఆ సంస్థ తెలిపింది. ఎంఇఐఎస్ స్కీం కింద కేంద్రం డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ సదుపాయాన్ని ఎగుమతిదారులకు కల్పించింది. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఎగుమతిదారులు టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుందని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండిక్రేఫ్ట్స్ తెలిపింది. గరిష్ట పరిమితి విలువను పెంచడం మంచి పరిణామమని పేర్కొన్నారు.