బిజినెస్

సిమెంట్, ఏసీలు, టీవీలపై తగ్గనున్న జీఎస్‌టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: సిమెంట్, ఏసీలు, టెలివిజన్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లు తగ్గుతాయనే విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగినందున వీటిపై పన్ను రేట్లు తగ్గుతాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేవలం లగ్జరీ వస్తువులపై మాత్రమే అధిక శ్లాబ్ అయిన 28 శాతం జీఎస్‌టీ కొనసాగుతుందని ఆయన శుక్రవారం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. జీఎస్‌టీ అమలులోకి రాకముందు చాలా మట్టుకు గృహోపకరణాలపై 31 శాతం పన్ను ఉండిందని పేర్కొంటూ, ఆనాటి పన్ను విధానాన్ని 3కాంగ్రెస్ లెగాసీ టాక్స్2గా జైట్లీ అభివర్ణించారు. గత సంవత్సర కాలంగా 384 సరుకులపై పన్ను తగ్గిందని ఆయన పేర్కొన్నారు. 17 స్థానిక పన్నులను కలిపి రూపొందించిన పరోక్ష పన్ను జీఎస్‌టీ 2017 జూలై ఒకటో తేదీన అమలులోకి వచ్చింది. 3ఈ రోజు 28 శాతం జీఎస్‌టీ శ్లాబులోని వస్తువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ శ్లాబ్‌లో ఎక్కువ మట్టుకు లగ్జరీ వస్తువులు మాత్రమే ఉన్నాయి. లగ్జరీ వస్తువులు కాకుండా 28 శాతం శ్లాబ్‌లో ఉన్న వస్తువులలో సిమెంట్, ఎయిర్‌కండిషనర్లు, పెద్ద తెర టీవీలతో పాటు మరికొన్ని ఉన్నాయి2 అని జైట్లీ వివరించారు. 3ఆదాయం మరింత పెరుగుతున్నందున ఈ వస్తువుల కేటగిరి కూడా మారిపోతుంది. కేవలం 13 నెలల రికార్డు సమయంలో జీఎస్‌టీ మండలి 28 శాతం శ్లాబులోనుంచి చాలా మట్టుకు వస్తువులను తొలగించింది. కాంగ్రెస్ లెగాసీ టాక్స్‌కు చరమగీతం పాడటానికి కొంత సమయం మాత్రమే పడుతుంది2 అని ఆయన పేర్కొన్నారు. సేవల రంగం గురించి జైట్లీ ప్రస్తావిస్తూ, 68 రకాల సేవలపై పన్ను రేటు తగ్గిందని పేర్కొన్నారు.