బిజినెస్

మళ్లీ మార్కెట్ల కొత్త రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో సరికొత్త రికార్డు సృష్టించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ చరిత్రలో మొదటిసారి కీలకమయిన 37,000 మార్కుకు పైన ముగిసింది. ఈ సూచీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగియడం వరుసగా ఇది అయిదో రోజు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగియడం వల్ల సెనె్సక్స్ చరిత్రలోనే ఈ వారం మరపురాని వారంగా నిలిచిపోతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా చారిత్రకంగా కీలక స్థాయి అయిన 11,200 మార్కును అధిగమించింది. వినియోగ వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లను మదుపరులు విస్తారంగా కొనుగోలు చేయడం వల్ల ఈ రెండు కీలక సూచీలు భారీగా పుంజుకున్నాయి. సెనె్సక్స్ 352 పాయింట్లకు పైగా పుంజుకుంది. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు శుక్రవారం పుంజుకున్నాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థలలో ఐటీసీ అత్యధికంగా 5.24 శాతం లాభపడింది. ఐటీసీ నికర లాభం జూన్ త్రైమాసికంలో పది శాతం పెరగడంతో ఆ కంపెనీ షేర్ విలువ బాగా పెరిగింది. దీంతో మార్కెట్ విలువ ఆధారంగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్‌ను వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత విలువయిన నాలుగో కంపెనీగా ఐటీసీ ఆవిర్భవించింది. ఇండెక్స్‌లోని కొన్ని ప్రధాన సంస్థలు జూన్ త్రైమాసికంలో అంచనాలను మించి ఆదాయాలను ఆర్జించడం, అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య వివాద ఉద్రిక్తతలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తరలిరావడం వంటి వాటివల్ల మదుపరుల సెంటిమెంట్ బలపడిందని బ్రోకర్లు చెప్పారు.
బీఎస్‌ఈ సెనె్సక్స్ శుక్రవారం ఉదయం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయి, ఒక దశలో ఇంట్రా-డే హై 37,368.62 పాయింట్లను తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 352.21 పాయింట్ల (0.95 శాతం) పైన 37,336.85 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం నాటి క్లోజింగ్ రికార్డు 36,984.64 పాయింట్లను అధిగమించింది. సెనె్సక్స్ 36,000 పాయింట్ల నుంచి 37,000 పాయింట్లకు చేరడానికి ఆరు నెలల (జనవరి 23నుంచి జూలై 27 వరకు) కాలం తీసుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా శుక్రవారం ఒక దశలో ఇంట్రా-డే హై 11,283.40 పాయింట్లకు చేరింది. అయితే చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 111.05 పాయింట్ల (0.99 శాతం) ఎగువన 11,278.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారం నాటి గరిష్ఠ రికార్డు ముగింపు 11,167.30 పాయింట్లను అధిగమించింది. వారం రీత్యా చూస్తే సెనె్సక్స్ ఈ వారంలో గణనీయంగా 840.48 పాయింట్లు (2.30 శాతం) పుంజుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 268.15 పాయింట్లు (2.44 శాతం) పెరిగింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం నికరంగా రూ. 2,453.57 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 2,716.04 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని లాభపడిన ఇతర సంస్థలలో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, రిల్, భారతి ఎయిర్‌టెల్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. మరోవైపు నష్టపోయిన ప్రధాన సంస్థలలో పవర్ గ్రిడ్, అదాని పోర్ట్స్, కోల్ ఇండియా, టీసీఎస్, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ ఉన్నాయి.