బిజినెస్

తగ్గిన ఎన్‌టీపీసీ నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఎన్‌టీపీసీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక నికర లాభం 1.14 శాతం తగ్గుదలతో రూ. 2,588.14 కోట్లు సాధించింది. తరుగుదల, రుణభారం, ఇంధన వ్యయం అధికం కావడం వల్ల నికర లాభం తగ్గిపోయింది. ఎన్‌టీపీసీ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 2,618.17 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నియంత్రణ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన పత్రాలలో ఎన్‌టీపీసీ ఈ వివరాలు వెల్లడించింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌టీపీసీ ఆదాయం 11 శాతం పెరుగుదలతో రూ. 22,839.98 కోట్లకు పెరిగింది. సంవత్సరం క్రితం తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 20,541.93 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే, ఎన్‌టీపీసీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (యంత్రాల) తరుగుదల వ్యయం ఖాతాలో రూ. 1,860.15 కోట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ ఖాతా కింద వ్యయం రూ. 1,570 కోట్లు మాత్రమే ఉండింది. అదే విధంగా రుణభార వ్యయం గత సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 895.60 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 1,219.93 కోట్లకు పెరిగింది. ఇంధన వ్యయం కూడా గత ఏడాది మొదటి త్రైమాసికంలో రూ. 11,940.11 ఉండగా, ఇప్పుడు రూ. 13,118.74 కోట్లకు పెరిగింది.