బిజినెస్

ఆర్భాటంగా పారిశ్రామిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: వ్యాపార రంగంలో పెట్టుబడులు ఎలా పెట్టాలి?, ఉత్తమ వ్యాపారవేత్తగా ఎలా వృద్ధి చెందాలి?, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎలా తట్టుకోవాలి? అనే అంశాలపై ప్రముఖ వ్యాపారులు తమ అనుభవాలను చెప్పారు. శనివారం హైటెక్స్‌లో ‘గోనాట్-2018’ పేరిట ఎంఎస్‌ఎంఇ సదస్సును, ప్రదర్శనను బిఎన్‌ఐ తన 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించింది. బిఎన్‌ఐ జాతీయ డైరెక్టర్ మురళీ శ్రీనివాసన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ బిఎన్‌ఐకు 71 దేశాల్లో ఉన్న 8,568 పైగా ఉన్న చాప్టర్లలో 2,39,999 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. బిన్ ఇండియా ప్రస్తుతం 58 నగరాల్లో 459 పైగా స్తానిక చాప్టర్లలో 22,900 మంది సభ్యులతో 61 నగరాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదని చెప్పారు. బిఎన్‌ఐ హైదరాబాద్ ప్రస్తుతం ఉన్న 1100 మంది సభ్యులను ఈ ఏడాది 1800 మందికి పెంచుకోవాలని, ప్రస్తుతం ఉన్న 650 కోట్ల రూప్యాల వ్యాపారాన్ని వెయ్యి కోట్లకు పెంచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నదని వివరించారు. బిఎన్‌ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమారి సంజనా షా మాట్లాడుతూ ‘గోనాట్-2018ను దేశవ్యాప్తంగా ఉన్న బిఎన్‌ఐ సభ్యులను ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం ద్వారా వారు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి, ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హైదరాబాద్‌కు చెందిన చిన్న మధ్య తరహా సంస్థల వ్యాపార కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో సీనియర్ డైరెక్టర్ కన్సల్టెంట్ టి. సతీష్ కుమార్, డైరెక్టర్ కన్సల్టెంట్ కెప్టెన్ ఆనంద్ పాల్గొన్నారు.