బిజినెస్

వచ్చే నెల 4కు విజయ్ మాల్యా చెక్ బౌన్సు కేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా కేసు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం ప్రకటించింది. తమకు విజయ్ మాల్యా ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువైన చెక్‌లు బౌన్స్ అయ్యాయనే అభియోగంతో జిఎంఆర్ సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసినది తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కోర్టు.. మాల్యాకు సమన్లు కూడా జారీ చేసింది. అయతే మాల్యా ప్రస్తుతం దేశంలో లేకపోవడంతో మాల్యాను కూడా విచారించాకే తుది తీర్పు ఇవ్వనున్నట్లు గతంలోనే కోర్టు ప్రకటించింది. నిజానికి ఈ కేసులో మాల్యాను దోషి అని కోర్టు నిర్ధారించినప్పటికీ మాల్యా ఒకసారి కోర్టుకు హాజరైతే విచారించి తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసిన కేసునూ ఎదుర్కొంటున్నది తెలిసిందే.