బిజినెస్

రైలు బోగీల మరమ్మతు కర్మాగారానికి మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జులై 7: రైల్వేశాఖ సహాయమంత్రి హోదాలో కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి కర్నూలుకు మంజూరు చేయించిన రైలు బోగీల మరమ్మతు కర్మాగారానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. రైల్వేశాఖ ఉన్నతాధికారులు గురువారం పాట్నా నుంచి కర్నూలు చేరుకుని పంచలింగాల సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. కర్మాగారం నిర్మాణానికి ఇప్పటికే రూ.281 కోట్ల విడుదలకు రైల్వేశాఖ ఆమోదం తెలపడంతో టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కర్నూలు శివార్లలోని పంచలింగాల గ్రామం వద్ద బోగీల మరమ్మతు కర్మాగారం నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 120 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. తొలుత ప్రహారీ, అనుసంధాన రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బీహార్ రాష్ట్రంలోని రైల్వే వర్క్‌షాప్‌కు చెందిన ఉన్నతాధికారులు దినేష్‌కుమార్, సునీల్‌కుమార్, ఎస్‌కె గోంగో, శ్రీవాస్తవ్ తదితరులు సికింద్రాబాదు నుంచి ప్రత్యేక రైలులో అలంపూర్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో పంచలింగాల చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. వీరి వెంట కర్నూలు ఎంపి బుట్టా రేణుక కూడా ఉన్నారు. ఆ తరువాత ఎంపి కార్యాలయంలో వారు సమావేశమై పనులు నిర్వహించాల్సిన తీరుపై చర్చించారు. రైలు బోగీల మరమ్మతు కేంద్రం నిర్మాణం పనులు రెండు నెలల్లో ప్రారంభించి రెండున్నర ఏళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించారు.