బిజినెస్

ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 7: ఇంధన సామర్థ్యానికి సంబంధించిన వేర్వేరు ప్రాజెక్టులను మరింతగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిపర్చేందుకు వీలుగా వెయ్యి కోట్ల రూపాయల మేర వెచ్చించాలని ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీసెస్ సంస్థ (ఇఇఎస్‌ఎల్) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో విశాఖ వేదికగా జరిగిన బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సుతో ఇంధన సామర్థ్య రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్థను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో తిరుపతిలో జాతీయ స్థాయి ఇంధన సామర్థ్య సదస్సు నిర్వహించేందుకు ఈ సంస్థ చర్యలు చేపట్టింది. ప్రపంచ దేశాలతోపాటు భారతదేశంలో పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చే విధంగా సంస్థ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇంధన సామర్థ్యం ప్రాజెక్టులను విస్తరించడం, ఆంధ్ర రాష్ట్రంలో దీనికి సంబంధించిన వేర్వేరు వినూత్న పథకాలను పటిష్టవంతంగా అమలు చేయడం కోసం ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించాలని, రానున్న ఐదేళ్ళల్లో ఆయా ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.చంద్రశేఖర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలోనే మరే రాష్ట్రంలో లేనివిధంగా అత్యంత కాంతివంతమైన, కాలుష్యరహితమైన తక్కువ ఖర్చుతో లభించే ఎల్‌ఇడి బల్బుల వాడకంలో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేయగా, పంజాబ్ రాష్ట్రంలో 57 లక్షల వరకే వాడుకలో ఉన్నాయన్నారు. ఈ విధంగా మధ్యప్రదేశ్‌లో 32 లక్షలు, మహారాష్టల్రో 1.82 కోట్లు, రాజస్థాన్‌లో 1.13కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 1.07 కోట్లు, ఢిల్లీలో 66 లక్షల మేర ఎల్‌ఇడి బల్బుల వాడకం ఉందన్నారు. ఈ విధణగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సైతం ఆంధ్ర రాష్ట్రంలో కంటే కూడా తక్కువ సంఖ్యలోనే ఏర్పాటయ్యాయన్నారు. అందువలనే అత్యుత్తమ ఇంధన సామర్థ్య రాష్ట్రంగా ఏపీని గుర్తించారని, ఇదే తరహాలో అత్యున్నత స్థాయి ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను మరింతగా ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తాము అనేక రకాలైన పథకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు.