బిజినెస్

ఐసీసీ సదరన్ రీజనల్ కౌన్సిల్ చైర్మన్‌గా తిక్కవరపు రాజీవ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) సదరన్ రీజనల్ కౌన్సిల్ చైర్మన్‌గా తిక్కవరపు రాజీవ్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలలో దేశంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. నూతన పారిశ్రామిక విధానం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

చిత్రం..సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్