బిజినెస్

మీరే ప్రాణాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జూలై 7: ప్రపంచంలోని పలు వర్థమాన దేశాల ప్రజలకు భారత ఫార్మాస్యూటికల్ (ఔషధ) రంగం ‘జీవన రేఖ’లా భాసిల్లుతోందని అంతర్జాతీయ స్థాయిలో సేవలందిస్తున్న ఒక సంస్థ ప్రశంసల జల్లు కురిపించింది. ఎయిడ్స్, టిబి, హెపటైటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడేందుకు భారత్ నుంచి వస్తున్న జనరిక్ మందులపై ఆధారపడిన ప్రపంచ దేశాల్లోని కోట్లాది మంది సామాన్య ప్రజలకు, ప్రత్యేకించి ఆఫ్రికా దేశాల్లోని నిరుపేదలకు వాటిని అందకుండా చేయాలని చూస్తున్న కార్పొరేట్ శక్తుల వత్తిడికి తలొగ్గరాదని ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ (ఎంఎస్‌ఎఫ్) సంస్థ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. చౌక ధరలకే జనరిక్ మందులను సరఫరాచేస్తూ దక్షిణాఫ్రికాతో పాటు ఆఫ్రికా ఖండంలోని పలు ఇతర దేశాల్లో కోట్లాది మంది నిరుపేదలను ఆదుకుంటున్న భారత ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయరాదని దక్షిణాఫ్రికాలో ఎంఎస్‌ఎఫ్ యాక్సెస్ క్యాంపెయన్ అడ్వకసీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న క్లెయిర్ వాటర్‌హౌస్ విజ్ఞప్తి చేశారు. ‘ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి స్వలాభం కోసం పాకులాడుతున్న అమెరికాతో పాటు ఆ దేశంలోని బహుళజాతి ఔషధ సంస్థల యాజమాన్యాలు ప్రస్తుతం పేద ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తున్న భారత పేటెంట్ నిబంధనలను ఉపసంహరించుకోవాలని తీవ్రస్థాయిలో వత్తిడి తీసుకొస్తున్నాయి. ఇటువంటి వత్తిడులకు భారత్ తలొగ్గితే ఔషధ రంగంలో కార్పొరేట్ శక్తుల గుత్త్ధాపత్యానికి తెరలేచి సామాన్య ప్రజలకు మందులు అందుబాటులో లేకుండా పోవడంతో పాటు ఆఫ్రికా ఖండం సహా పలు ఇతర దేశాల్లోని కోట్లాది మంది ప్రజలు పెను విపత్తులో చిక్కుకోవడం ఖాయం’ అని ఎంఎస్‌ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్ కార్పొరేట్ శక్తుల వత్తిడులకు తలొగ్గరాదని, దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచంలోని పలు ఇతర వర్థమాన దేశాల్లోని సామాన్య, నిరుపేద ప్రజలకు ఇకముందు కూడా సరసమైన ధరలకే జనరిక్ మందుల సరఫరాలను కొనసాగించాలని నరేంద్ర మోదీకి ఎంఎస్‌ఎఫ్ విజ్ఞప్తి చేసింది.