బిజినెస్

ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ రంగనాథ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) ఎండీ రంగనాథ్ తన పదవి నుంచి తప్పుకున్నారు. రంగనాథ్ సమర్పించిన రాజీనామాను కంపెనీ బోర్డ్ ఆమోదించిందని ఇన్ఫోసిస్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, రంగనాథ్ కంపెనీ సీఎఫ్‌ఓ పదవిలో ఈ సంవత్సరం నవంబర్ 16వరకు కొనసాగుతారు. కొత్త సీఎఫ్‌ఓగా ఎవరిని నియమించాలనే అంశంపై బోర్డ్ తక్షణమే దృష్టి సారిస్తుందని ఇన్ఫోసిస్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దేశంలోని సాఫ్ట్‌వేర్ సేవలను ఎగుమతి చేస్తున్న సంస్థలలో ఒకటయిన ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓగా రంగనాథ్ 2015లో నియమితులయ్యారు. కంపెనీలో 18 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సీఎఫ్‌ఓగా పనిచేసిన రంగనాథ్ ఇన్ఫోసిస్ లీడర్‌షిప్ టీమ్‌లో భాగస్వామిగా వ్యవహరించారని, అనేక నాయకత్వ పాత్రలు నిర్వహించారని ఆ కంపెనీ వివరించింది.