బిజినెస్

రూపాయి కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 25: రూపాయి మార కం విలువ కోలుకుంది. అమెరికా మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడంతో రూపా యి విలువ 24పైసల మేర పెరిగింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ భారత కరెన్సీలో రూ. 69.91 పైసలు. గత వారం నుంచి అమెరికా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. గత వారం డాలర్ విలువ భారత కరెన్సీలో రూ.70.40 పైసలకు చేరింది. టర్కీ సంక్షోభం నేపథ్యంలో భారత్ రూపాయి మారకం విలువ పడిపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. గత వారం భారత్ విదేశీ మారకద్రవ్యం విలువ 33.2 మిలియన్ డాలర్ల మేర తగ్గి 400.847 డాలర్ల వద్ద నిలిచిందని ఆర్‌బీఐ పేర్కొంది. గత కొన్ని వారాలుగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తేపతనం కావడంతో భారత్ మార్కెట్, ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. కాగా అనూహ్యంగా గత వారం రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో రూపాయి నిలదొక్కుకోవడంతో మార్కెట్ రంగం ఊపిరి పీల్చుకుంది.