బిజినెస్

అయిదో వారమూ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం బలపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 303.92 పాయింట్లు పుంజుకొని, 38,251.80 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 86.35 పాయింట్లు పెరిగి, 11,557.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. గతంలో ఏ వారంలోనూ లేనివిధంగా ఈ వారంలో ఈ రెండు కీలక సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం కావడం, ముడి చమురు ధరలు అధిక స్థాయిల వద్ద కొనసాగుతుండటం వంటి వాటివల్ల దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ సెంటిమెంట్ ఈ వారంలో దెబ్బతిన్నది. బక్రీద్ పండుగ కారణంగా స్టాక్ మార్కెట్లు ఆగస్టు 22వ తేదీ పనిచేయలేదు. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) గణనీయ స్థాయిలో కొనుగోళ్లు జరపడంతో పాటు ఎంపిక చేసిన స్టాక్‌లను మదుపరులు చేజిక్కించుకోవడం వల్ల షేర్ల ధరలలో కదలిక వచ్చి, ఇండెక్స్‌లోని దిగ్గజ కంపెనీలు లాభపడ్డాయి. రూపాయి కోలుకోవడం, ముడి చమురు ధరలు కొంత వరకు తగ్గడంతో పాటు ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల తీరు మారడం, కొన్ని స్టాక్‌ల సానుకూలతలను వెల్లడిస్తూ వచ్చిన వార్తలు ఈ వారం ర్యాలీని ముందుకు తీసికెళ్లాయి.
అయితే, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయిన కారణంగా ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరేబుల్స్, బ్యాంకెక్స్, ఐటీ, స్థిరాస్తి, టెక్నాలజి స్టాక్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, క్యాపిటల్ గూడ్స్, పవర్, హెల్త్‌కేర్, మెటల్, చమురు- సహజ వాయువు షేర్లలో ముమ్మర కొనుగోళ్లు కీలక సూచీలు నష్టపోకుండా నివారించాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారం 38,075.07 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, ఆల్ టైమ్ హై 38,487.63 పాయింట్లను చేరి, చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 303.92 (0.80 శాతం) ఎగువన 38,251.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు వారాలలో కలిసి 1,676.78 పాయింట్లు (4.56 శాతం) పుంజుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఈ వారం 11,502.10 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, ఆల్ టైమ్ హై 11,620.70 పాయింట్లకు చేరి, చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 86.35 పాయింట్ల (0.75 శాతం) పైన 11,557.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 246.30 పాయింట్లు (1.51 శాతం) పుంజుకొని 16,552.74 పాయింట్ల వద్ద ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.78 పాయింట్లు (0.01 శాతం) నష్టపోయి, 16,864.43 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, ఎఫ్‌ఐఐలు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) కలిసి ఈ వారంలో నికరంగా రూ. 198.85 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.