బిజినెస్

ఆర్‌జియోకు ఆర్‌కామ్ ఫైబర్ అమ్మకం ప్రక్రియ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: గత ఏడాది డిసెంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలియన్స్ జియో లేఫోకామ్ (ఆర్‌జియో)కు 3,000 కోట్ల రూపాయల విలువైన ఫైబర్ వౌలిక సదుపాయాలు, ఆస్తుల అమ్మకం ప్రక్రియను పూర్తి చేసినట్టు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ప్రకటించింది. ఇందులో భాగంగా 1,78,000 కిలోమీటర్ల ఫైబర్ స్టాండ్ ఆర్‌కామ్ నుంచి జియోకు బదిలీ అయింది. ఈనెల ఆరంభంలో 2,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం మేరకు జియోకు మీడియా కవరేజ్ నోడ్స్ (ఎంసీఎన్), దాని అనుబంధ వౌలిక సదుపాయాలను ఆర్‌కామ్ అమ్మేసింది. టెలికాం ట్రిబ్యూనల్ విధించిన గడువులోగా 774 కోట్ల రూపాయల విలువైన బ్యాంక్ గ్యారెంటీని సజీవంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌కామ్ ప్రకటించింది. మొత్తం 25,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేందుకు ఆర్‌కామ్ సిద్ధపడగా, గత ఏడాది అనిల్ తన సోదరుడు ముఖేష్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వైర్‌లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్, ఎంఎన్‌సీ ఆస్తులను అమ్మాల్సి ఉంది. అందులో భాగంగానే ఫైబర్ ఆస్తుల అమ్మకాల ప్రక్రియ పూర్తయింది. మ్తొం మీద 4జీ స్పెక్ట్రమ్‌కు చెందిన 43,000లకుపైగా టవర్లు, 1,78,000 మైళ్ల పొడవైన ఫైబర్‌తో కూడిన 122.4 మెగా హెడ్జ్ ఎంసీఎన్ కింద జియోకు ఆర్‌కామ్ అమ్ముతున్నది. ఈ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది.