బిజినెస్

చైనా ఉత్పత్తుల దిగుమతికి అడ్డుకట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఇరుపొరుగు దేశాలు, ముఖ్యంగా చైనా నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే వైద్య రంగంలో రోగ నిరోధానికి ఉపయోగించే ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశీయంగా వైద్య రంగంలో రోగ నిరోధానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సంస్థలు ఆందోళన వెలిబుచ్చిన విషయాన్ని గమనంలోకి తీసుకున్న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) ఈ దిశగా దర్యాప్తును వేగవంతం చేస్తోంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న వైద్య రంగానికి సంబంధించిన ఉత్పత్తులకు ఇస్తున్న సబ్సిడీ వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తులు తయారు చేసే సంస్థలకు అన్యాయం జరుగుతోందని మెఘామణి ఇండస్ట్రీస్ డీజీటీఆర్‌కి ఫిర్యాదు చేసింది. చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయంలో ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు ఆ దేశం నుంచి అన్నిరకాలుగా అందివస్తున్న సబ్సిడీ వంటి వాటి వల్ల మరింత ప్రయోజనం పొందుతున్నాయి. చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఆయా రాష్ట్రాలు, మున్సిపాలిటీలకు కూడా మేలు జరుగుతోంది. చైనా ఉత్పత్తుల కారణంగా ఆ దేశానికి, వాటిని సరఫరా చేసే సంస్థలకు ఆర్థికపరంగా చాలా మేలు జరుగుతోందని, కానీ దేశీయంగా తయారయ్యే సంస్థలకు నష్టం జరుగుతోందని డీజీటీఆర్ అభిప్రాయపడుతోంది.