బిజినెస్

రికార్డు పరుగుకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 29: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం బలహీనపడ్డాయి. రెండు రోజుల పాటు సరికొత్త ముగింపు రికార్డులను సృష్టించిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం 173 పాయింట్లు పడిపోయింది. ముఖ్యంగా కీలకమయిన ఇంధన స్టాక్‌లు రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా నష్టపోవడం వల్ల ఈ కీలక సూచీ పడిపోయింది. సెనె్సక్స్ బుధవారం లావాదేవీలలో ఒక దశలో ఆల్ టైమ్ ఇంట్రా-డే హై 38,989.65 పాయింట్లను తాకింది. అయితే, ఇటీవలి ర్యాలీలో షేర్ల ధరలు పెరగడంతో మదుపరులు బుధవారం లాభాల స్వీకరణకు పూనుకున్నారు. దీంతో ఈ సూచీ ఇంట్రా-డేలో 38,679.57 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 173.70 పాయింట్ల (0.45 శాతం) దిగువన 38,722.93 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా బుధవారం ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో క్రితం ముగింపుతో పోలిస్తే 46.60 పాయింట్ల (0.40 శాతం) దిగువన 11,691.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ గరిష్ట స్థాయి 11,753.20 పాయింట్లు, కనిష్ట స్థాయి 11,678.85 పాయింట్ల మధ్య కదలాడింది. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 181.40 పాయింట్లు (1.54 శాతం) పుంజుకుంది. వరుసగా ఏడు సెషన్ల పాటు పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బుధవారం 1.8 శాతం పడిపోయింది. ఈ షేర్ల రోజువారీ లావాదేవీల పరిమాణం కూడా 1.5 రెట్లు పెరిగి, రూ. 5.71 లక్షలకు చేరుకుంది. ఈ షేర్ల రెండు వారాల సగటు రోజువారి లావాదేవీల పరిమాణం రూ. 3.78 లక్షలు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో కోల్ ఇండియా అత్యధికంగా 2.58 శాతం నష్టపోయింది. దీంతో ఇండెక్స్ ప్రతికూల జోన్‌లోకి వెళ్లిపోయింది. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా మదుపరుల లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా బుధవారం ఇంట్రా-డేలో సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 70.57 మార్కుకు పడిపోయింది. రూపాయి బలహీనపడటం, ఆగస్టు నెల ఎఫ్‌అండ్‌ఓ కాలపరిమితి గురువారంతో ముగియనుండటం కూడా దేశీయ మార్కెట్లు బలహీనపడటానికి కారణమయ్యాయి. బుధవారం లావాదేవీలలో నష్టపోయిన సంస్థల్లో పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్, వేదాంత, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, అదాని పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.58 శాతం వరకు పడిపోయింది. ఇందుకు భిన్నంగా ఓఎన్‌జీసీ షేర్ విలువ అత్యధికంగా 1.58 శాతం పెరిగింది. లాభపడిన ఇతర సంస్థల్లో టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ లిమిటెడ్, విప్రో, ఎంఅండ్‌ఎం, కోటక్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో ఉన్నాయి. రంగాలవారీగా చూస్తే, బీఎస్‌ఈ ఎనర్జీ ఇండెక్స్ అత్యధికంగా 1.13 శాతం పడిపోయింది. టెలికం ఇండెక్స్ 0.71 శాతం నష్టంతో రెండో స్థానంలో నిలిచింది.