బిజినెస్

త్వరలో మరిన్ని ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 1: చైనాలో సోమవారం నుంచి జరుగనున్న చైనా-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశంలో ఆఫ్రికా దేశాల్లో చైనా పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని పథకాలను చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అనేక మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆఫ్రికా దేశాలను అన్ని రకాలుగా అత్యున్నత ప్రాముఖ్యతగల గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు సంబంధించిన ప్రాజెక్టులకు చైనా మిలియన్లకొద్దీ డాలర్ల సాయం అందజేస్తోంది. కాగా ప్రస్తుతం అమలులో ఉన్న, భవిష్యత్తులో ప్రకటించనున్న మరిన్ని ప్రాజెక్టులకు (బిఆర్‌ఐ)కు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. చైనా ఈ తరహా సమావేశాన్ని మూడోసారి నిర్వహిస్తోంది. కాగా చైనా-ఆఫ్రికా సంబంధాలపై కొత్త విధానాలు, ప్రతిపాదనలను చైనా అధ్యక్షుడు ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో సెప్టెంబర్ 3,4 తేదీల్లో జరిగే ఫోరమ్ ఆన్ చైనా-ఆఫ్రికన్ కోఆపరేషన్ (ఎప్‌ఓసీఏసీ) ముందు కొత్త ప్రాజెక్టుల విషయం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆన్టోనియో గుటర్రెస్ సైతం ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యే అవకాశాలున్నాయి. బిఆర్‌ఐలో భాగంగా ఉన్న చైనా-పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)ను భారత్ తొలినుంచి వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ఈ కారిడార్ ఉండటమే ఇందుకు కారణం. ఆఫ్రికాలో పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ రంగ అధునీకరణ తదితరాలకు సంబంధించిన 10 ప్రాజెక్టులను గతంలో దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్స్‌బర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో గ్జీ జింగ్‌పింగ్ ప్రకటించారు. 60 మిలియన్ అమెరికన్ డాలర్లను సాయంగా అందజేస్తున్నట్లు చైనా అధ్యక్షుడు ప్రకటించగా అందులో చాలా ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.