బిజినెస్

వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి. ఎందుకంటే దేశంలోని అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శనివారం బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌ను) 0.2 శాతం పెంచింది. ఇతర బ్యాంకులు కూడా తమ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి, 6.5 శాతం చేసిన నెల రోజుల తరువాత ఎస్‌బీఐ వడ్డీ రేట్లను పెంచింది. అంతకు ముందు ఆర్‌బీఐ జూన్ ఆరో తేదీన రెపో రేటును 0.25 శాతం పెంచుతూ, ఆరు శాతం నుంచి 6.25 శాతానికి సవరించింది. 2014 జనవరి 28 తరువాత ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను మొదటిసారిగా జూన్‌లో పెంచింది. ఎస్‌బీఐ పెంచిన వడ్డీ రేట్లు శనివారం నుంచే అమలులోకి వచ్చాయి. మూడేళ్ల వరకు కాల పరిమితి గల రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారం, నెల రోజుల లోపు కాల పరిమితి గల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్) 7.9 శాతం నుంచి 8.1 శాతానికి పెరిగింది. ఏడాది కాల పరిమితి గల రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. మూడేళ్ల కాల పరిమితి గల రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 8.45 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది.