బిజినెస్

విప్రోకు భారీ ఆర్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అమెరికాకు చెందిన అలైట్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌సి నుంచి 1.5 బిలియన్ డాలర్ల ఆర్డర్‌ను పొందినట్లు ఐటి దిగ్గజం విప్రో పేర్కొంది. తమ సంస్థ ఇటీవలకాలంలో అతి పెద్ద ఆర్డర్‌ను పొందడం ఇదే తొలిసారి అని విప్రో పేర్కొంది. ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఇలినాయిస్‌కు చెందిన అలైట్ సొల్యూషన్స్‌కు వివిధ సేవలపై సొల్యూషన్స్‌ను అందిస్తామని విప్రో పేర్కొంది. ఆరోగ్యం, సంపద, మానవ వనరులు, ఫైనాన్స్ విభాగంలో సొల్యూషన్స్ అందిస్తారు. డిజిటలైజేషన్ టెక్నాలజీకి ఈ సంస్థ తన సేవలను మార్చబోతోందని విప్రో పేర్కొంది. ఆటోమేషన్, ఇన్నోవేషన్ విభాగాల్లో విప్రో అత్యుత్తమ సేవలు అందిస్తోందని అలైట్ సొల్యూషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిరిస్ మైకలాక్ చెప్పారు.