బిజినెస్

శ్రీవరి సాగుతో రైతులకు రెండింతల లాభం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: ప్రస్తుతం వ్యవసాయమంటేనే రైతులు హడలిపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో సేద్యం చేయడానికి సాహసించలేక పోతున్నారు. భూమినే నమ్ముకున్న కొందరు రైతన్నలు తప్పనిసరి పరిస్థితుల్లో సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ తుపాన్లు, తెగు ళ్లు, ఎరువులు, పురుగుల మందుల ధరలు కొండంత పెరిగిన కూలీల కూలి రేట్లు.. ఇలా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయనా ఆరుగాలం శ్రమిస్తే దక్కేది అరకొర పంట మాత్రమే. పోనీ దానికేమైనా మంచి ధర లభిస్తోందా? అంటే అదీలేదు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగిరాని దుస్థితి. ఆపై చేసిన అప్పు లు తీర్చలేక, ఇటు భార్యాబిడ్డలకు నాలుగు మెతుకులు పెట్టలేక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చివరకు బలవన్మరణాలకూ పాల్పడుతూ నేలతల్లి ఒడిలో వాలిపోతున్నారు. అయతే శాస్తవ్రేత్తలు కనిపెడు తున్న నూతన వంగడాలతో రైతులకు మంచి రోజులు వస్తాయనిపిస్తోంది. అలాంటి నూతన వంగడాల్లో ఒకటి శ్రీవరి సాగు. దేశంలో 70 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా సాగుచేసేది వరి పంటే. అయతే నీటి ఆధారిత పంట కావడంతో అతివృష్టి, అనావృష్టి కారణంగా తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సాధారణ వరిసాగులో అధిక పెట్టుబడి అవసరమవుతుంది. ఎకరానికి 20 కేజీల విత్తనాలను వినియోగిస్తారు. 15 నుంచి 20 బస్తాల వరకూ దిగుబడి వచ్చే అవకాశముంది. అదే శ్రీవరి సాగులో ఎకరానికి రెండు కేజీల విత్తనాలు సరిపోతాయి. దిగుబడి 35 బస్తాల వరకూ ఉంటుంది. అంటే సాధారణ వరిసాగు కంటే శ్రీవరిలో అదనపు రాబడి సాధించవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు శ్రీవరి సాగు ఎంతో లాభదాయకం. ఇంతటి లాభదాయకమైన శ్రీవరిని తొలుత తూర్పు ఆఫ్రికా సమీపంలోని మలగాసీ దీవి (మడగాస్కర్) లో సాగు చేశారు. అక్కడి నుంచి చైనా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి అనేక దేశాలకు విస్తరించింది.
హెక్టారుకు రెండు టన్నుల దిగుబడి
జల సంబంధమైన వరి మొక్క నీటిలో పాతుకుపోతున్నప్పుడు బాగా పెరుగుతుంది. అలాగని వరి నీటిమొక్క కాదు. వేర్లల్లో గాలి బుడగ ఏర్పడడానికి వరి మొక్క ఎంతో శక్తిని వినియోగించుకోవలసి వస్తుంది. వరిలో పూత సమయంలో సుమారు 70 శాతం వేరు చివర్లు నాశనమైపోతాయి. అదే శ్రీవరి సాగు పొలంలో నీరు లోతుగా ఉండనవసరం లేదు. చేను పెరిగేటప్పుడు తడిగా ఉంటే చాలు. తరువాత 2.5 సెం.మీ.ల వరకు నీరు ఉండాలి. శ్రీవరి సాగుకు సంప్రదాయ పద్ధతిలో వరి చేనుకు కావలసినంత నీటి లోతులో సగమైతే చాలు. దీని విత్తనాలను 25 సెం.మీ.ల విస్తీర్ణంతో తక్కువగా నాటిస్తే చాలు. చేను ఏపుగా పెరుగుతుంది. సహజ పద్ధతిలో దాని వేర్లు పుష్కలంగా పెరుగుతాయి. లోపలి పొరల నుండి పోషకాలను వేర్లు గ్రహిస్తాయి. ప్రారంభ దశలో శ్రీవరి సాగుకు ఎక్కువ మంది కూలీలు అవసరమైనా, ఊడ్పుకు, కలుపుతీతకు అందులో 50 శాతం మాత్రమే చాలు. సగటున పంట దిగుబడి హెక్టారుకు 2 టన్నులు వస్తుంది.
కలుపుతీత-గాలి చొరవ
కలుపుతీత, గాలి చొరవ వల్ల మురుగునీరు నిలువకుండా ఉంటుం ది. రొటేటింగ్ అనే సరళమైన యంత్రాన్ని వాడటం వల్ల మట్టిని గుల్లబరుస్తుంది. ఇలా రెండు పర్యాయాలు చేస్తే సరిపోతుంది. పూత పూసే ముందు నాలుగు పర్యాయాలు చేయాలి. నాటిన పది రోజుల తరువాతే మొదటి కలుపుతీత చేయాలి. కలుపు మొక్క లేకపోవడం వల్ల వరి వేర్లు బాగా పెరుగుతాయి. గాలి కూడా వేళ్లకు అందుతుంది. ఆక్సిజన్, నైట్రోజన్ కూడా బాగా అందుతాయి. ఫలితంగా మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర ఇనుమడిస్తుంది. ప్రతి రెండు పర్యాయాలు కలుపు తీతకు హెక్టారుకు రెండు టన్నుల ఉత్పాదకత పెరగడానికి అవకాశం ఉంది. రసాయనిక ఎరువులకు బదులుగా కంపోస్టు, పశువుల పెంట హెక్టారుకు పది టన్నులు వేయాలి. గుల్లగా ఉండటం వల్ల మన్ను బాగుపడి పోషకాల సరఫరా లో సమతూకం సాధించడానికి వీ లుంది. శ్రీవరి సాగులో ఎనిమిది నుంచి 12 రోజుల ప్రాయం కలిగిన వరి మొక్కలను ఊడుస్తారు. ఇందువల్ల వేర్లు బాగా పాతుకుపోయి ప్రతి మొక్కా 30 నుంచి 50 పిలకలు వేయడానికి వీలుంటుంది. ఈ సూత్రాలు పాటిస్తే ఎకరాకు 35 బస్తాలకుపైబడి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు వివరిస్తున్నారు.