బిజినెస్

మండుతున్న పెట్రోల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: గతంలో ఎన్నడూ లేని రీతిలో శనివారం తొలిసారి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80 దాటింది. రూపాయి విలువ పతనమయి, దిగుమతులు ప్రియం కావడం వల్ల పెట్రోల్ ధర బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం సవరించిన ధరల ప్రకారం దేశంలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరగగా, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.38కి చేరుకుంది. డీజిల్ ధర కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్‌కు రూ. 72.51కు చేరుకుంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.77కు, లీటర్ డీజిల్ ధర రూ. 76.98కి చేరుకుంది. దేశంలోని మెట్రో నగరాలు, అనేక రాష్ట్రాల రాజధాని నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఢీల్లీలో పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నులు తక్కువగా ఉన్నాయి. అన్ని మెట్రో నగరాలలోకన్నా ముంబయిలో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు నెల మధ్య నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ. 3.24, లీటర్ డీజిల్ ధర రూ. 3.74 చొప్పున పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోవడం వల్ల చమురు దిగుమతులు ప్రియం అయ్యి, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిరుడు జూన్ నెల మధ్య నుంచి రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించుకునే అధికారాన్ని ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు అప్పగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పక్షం రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత ఎక్కువగా పెరగడం ఇదే మొదటిసారి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుండటాన్ని నిరసిసస్తూ ప్రతిపక్షాలు సోమవారం (సెప్టెంబర్ 10) దేశవ్యాప్త బంద్ (భారత్ బంద్)కు పిలుపునిచ్చాయి.