బిజినెస్

మూడు వారాల కనిష్టానికి మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత కొన్ని రోజులుగా ఆశావహ రీతిలో సాగిన భారతీయ స్టాక్ మార్కెట్‌లో గత మూడువారాల్లో ఎన్నడూ లేనిరీతిలో సోమవారం కుదేలయ్యాయి. ఒకపక్క డాలర్ మారకంతో రూపాయి పతనం కొనసాగడం, మరోపక్క అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలపై ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో వాటి ప్రభావం ఇటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ లావాదేవీలపై పడింది. మారిన ఈ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ గత మూడు వారాల్లో ఎన్నడూ లేనివిధంగా సెనె్సక్స్ 467.65 పాయింట్లు కోల్పోయి 37,9222,17 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్చి 16 నుంచి సెనె్సక్స్ ఒక్కరోజులు ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. అలాగే నిఫ్టీ కూడా 151 పాయింట్లు కోల్పోయి 11,500 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఒకేరోజు నిఫ్టీ ఇంతగా పతనం కావడం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఇదే మొదటిసారి.
అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతుందన్న ఆందోళనలు మదుపుదారులను ముందుకువెళ్లకుండా చేశాయి. రెండు పెద్ద దేశాల మధ్య వాణిజ్య విపరిణామాలు తగ్గే సూచనలు లేకపోవడంతో ఇనె్వస్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతిందని, ముడిచమురు ధరలు కూడా పెరగడం మార్కెట్ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం చూపిందని చెబుతున్నారు. భారత రూపాయి కూడా అమెరికా మారకంతో పోలిస్తే మరింత దిగజారి 72.67కు చేరుకుంది. రూపాయి విలువ ఇలా తగ్గడమన్నది భారత కంపెనీల పరపతిపై ప్రతికూల ప్రభావాన్ని కనబరిచేదన్న ముడీస్ సంస్థ చెప్పిన నేపథ్యంలో మార్కెట్ పరిణామాలు మరింత నిరాశావహంగా మారాయి.
నేటి లావాదేవీల్లో సన్‌ఫార్మా షేర్లు దారుణంగా దెబ్బతిని 3.72 శాతం నష్టపోయాయి. అలాగేమహేంద్ర-మహేంద్ర సంస్థ షేర్ల విలువ కూడా 3.64 శాతం మేరకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, రిలయన్స్ షేర్లు కూడా పతనమయ్యాయి. దీని ఫలితంగానే మూడువారాల కనిష్టానికి సెనె్సక్స్ చేరుకుంది. నష్టపోయిన కంపెనీల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆసియా పెయింట్స్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, ఐసీసీఐ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్ సంస్థలున్నాయి. అయితే, ఈ ప్రతికూల పరిణామాలను తట్టుకుంటూ యాక్సిక్ బ్యాంక్, విప్రో, ఎస్‌బ్యాంక్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు స్వల్పంగా పుంజుకున్నాయి.