బిజినెస్

ఆగని చమురు మంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కూడా పెరిగాయి. లీటర్‌కు 14 పైసల చొప్పున పెరిగిన వీటి ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రూపాయి మారకం విలువ సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులు మరింత ప్రియమై దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం జారీ చేసిన ధరల నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.87కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.26కు చేరింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 72.97కు, ముంబయిలో రూ. 77.47కు పెరిగింది. దేశంలోని ఇతర అన్ని మెట్రో నగరాల కన్నా, అనేక రాష్ట్రాల రాజధానుల కన్నా ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తక్కువగా విధిస్తుంటారు. ముంబయిలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధికంగా వ్యాట్ విధిస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర చెన్నైలో రూ. 84.07కు, కోల్‌కతాలో రూ. 83.75కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర చెన్నైలో రూ. 77.15కు, కోల్‌కతాలో రూ. 75.82కు పెరిగిపోయింది.