బిజినెస్

పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 11: ప్రస్తుతం మార్కెట్‌లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేదిశగా కృషి జరగాల్సిన అవసరం ఎంతో ఉందని మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అభిప్రాయపడింది.
అదేసమయంలో ఇపుడున్న నిబంధనలను మరింత పటిష్టం చేయడంతోపాటు ఆర్థిక నేరాలు, మోసాలు, మార్కెట్‌ను తారుమారు చేయడం, అంతర్గత ట్రేడింగ్ అంశాల్లో మరింత నిజాయితీ, పారదర్శకత ఉండాలని పేర్కొంది.
మార్కెట్‌లో పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలు పెంచే దిశగా తాము చర్యలు తీసుకోవడంతోపాటు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా తాము కట్టుబడి ఉంటామని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి ఇక్కడ మంగళవారం జరిగిన ‘్ఫక్కీ సీఏపీఎం 2018’ సదస్సు సందర్భంగా పేర్కొన్నారు. సెబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నీతి, నిజాయితీ, జవాబుదారీతనం గల మార్కెట్ ప్రతిపాదించిన సలహాలను, సూచనలు అమలు జరిగేందుకు కట్టుబడి ఉంటామని, ఈ విషయంలో ప్రజల నుంచి వచ్చే ఎలాంటి విమర్శలనైనా స్వీకరిస్తామని, అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల ద్వారా ముందుకు సాగుతామని తెలిపారు. స్టాక్ మార్కెట్‌కు నష్టం చేకూర్చేందుకు ప్రయత్నించే శక్తుల ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు.
గత రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్‌లో 900 పాయింట్ల వరకు పడిపోవడంతో దేశీయ, అంతర్జాతీయపరంగా ఇనె్వస్టర్లు పెట్టుకున్న ఆశలను తమకు అనుకూలంగా మలచుకునే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటామని తెలిపారు.
గత కొద్దిరోజులుగా దేశీయంగా పెరుగుతున్న పెట్రో ధరల పెంపు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితుల సవాళ్లు, వ్యాపార, వాణిజ్య అంశాల్లో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని అన్నారు.