బిజినెస్

పుంజుకున్న పారిశ్రామికోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశ పారిశ్రామికోత్పత్తి జూలై నెలలో 6.6 శాతం వృద్ధి చెందింది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్ సెక్టర్) పనితీరు బాగుండటంతో పాటు క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరేబుల్స్‌కు డిమాండ్ పెరగడం వల్ల పారిశ్రామికోత్పత్తి వృద్ధి పుంజుకుంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా చూస్తే నిరుడు జూలైలో పారిశ్రామికోత్పత్తి కేవలం ఒక శాతం మాత్రమే వృద్ధి చెందింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ సంవత్సరం జూన్‌లో ఐఐపీ వృద్ధిని గత నెలలో ప్రాథమికంగా అంచనా వేసిన ఏడు శాతం నుంచి ఇప్పుడు 6.8 శాతానికి సవరించారు. మాన్యుఫాక్చరింగ్ సెక్టర్ ఈ సంవత్సరం జూలైలో ఏడు శాతం వృద్ధి చెందింది. నిరుడు జూలైలో ఈ రంగం కేవలం 0.1 శాతం మాత్రమే వృద్ధి చెందింది. కన్స్యూమర్ డ్యూరేబుల్స్ రంగం ఈ సంవత్సరం జూలైలో అద్భుతంగా 14.4 శాతం వృద్ధి చెందింది. నిరుడు జూలైలో ఈ రంగం కేవలం 2.4 శాతమే వృద్ధి చెందింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి ఈ సంవత్సరం జూలైలో మూడు శాతం వృద్ధి చెందింది. నిరుడు జూలైలో ఈ రంగం వృద్ధి 1.1 శాతం పడిపోయింది.