బిజినెస్

తగ్గుతున్న పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వరుసగా రెండు నెలల పాటు దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపరులు గత పక్షం రోజుల్లో పెద్ద మొత్తంలో రూ. 9,400 కోట్లు ఉపసంహరించుకున్నారు. చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం కారణంగా దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరిగిన నేపథ్యంలో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశ ఈక్విటీ, డెబిట్ మార్కెట్లలో కలిపి గత నెలలో నికరంగా రూ. 5,200 కోట్లు, జూలై నెలలో రూ. 2,300 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంతకు ముందు ఏప్రిల్- జూన్ త్రైమాసిక కాలంలో ఎఫ్‌పీఐలు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 61,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. తాజా డిపాజిటరి గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు సెప్టెంబర్ 3-14 తేదీల మధ్య కాలంలో నికరంగా రూ. 4,318 కోట్ల నిధులను ఈక్విటీ మార్కెట్ల నుంచి, రూ. 5,088 కోట్ల నిధులను డెబిట్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. అంటే మొత్తం రూ. 9,406 కోట్ల (1.3 బిలియన్ డాలర్ల) నిధులను భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.