బిజినెస్

విమానం ఎక్కేద్దాం పదండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: విమానయానం.. సంపన్నులకు మాత్రమే అనువైన ప్రయాణం. అయితే ఇప్పుడు ఈ మాటకు కాలం చెల్లింది. మధ్యతరగతి ప్రయాణికులకూ విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తోంది మరి. విమానయాన సంస్థల ఆలోచనల్లో మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సంస్కరణలు కలిసి విమాన ప్రయాణాన్ని సామాన్యుడికీ సౌకర్యవంతంగా చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ వివిధ రకాల ఆఫర్లతో విమానయానాన్ని చౌక చేసినది తెలిసిందే. పండగ సమయాల్లో, వేసవి కాలంలో పలు ఆఫర్లను ప్రకటించి తక్కువ ధరకే టిక్కెట్లను విక్రయిస్తున్నాయి. కనిష్టంగా 500 రూపాయల నుంచే దేశీయంగా వివిధ ప్రాంతాలకు టిక్కెట్లను ఆఫర్ చేస్తున్న విమానయాన సంస్థలు.. విదేశీ విమానయానాన్నీ తక్కువకే అందిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ విషయంలో స్పైస్‌జెట్ ముందుండగా, ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, గోఎయిర్, ఎయిర్‌ఏషియా సంస్థలూ ఈ దిశగా వేగంగానే అడుగులు వేస్తున్నాయి. ఎయిర్‌ఏషియా, ఇండిగో, జెట్ ఎయర్‌వేస్.. ఇప్పటికే ప్రయాణికుల కోసం పలు ప్రోత్సాహక ఆఫర్లను ప్రకటించాయ. 786 రూపాయల ప్రారంభ చార్జీ (అన్ని పన్నులతోసహా)తో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎయిర్‌ఏషియా టిక్కెట్లను తెచ్చింది. టిక్కెట్ బుక్ చేసుకున్నవారు ఎయిర్‌ఏషియా విమానాలు తిరిగే మార్గాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణం చేసే వీలుంటుంది. అలాగే ఇండిగో సంస్థ మాన్‌సూన్ సేల్ పేరిట 871 రూపాయల ప్రారంభ ధర (అన్ని పన్నులతోసహా)తో టిక్కెట్లను పరిచయం చేసింది. టిక్కెట్లను బుక్ చేసుకున్నవారు ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణిం చవచ్చు. జెట్ ఎయర్‌వేస్ కూడా దేశీయంగా తక్కువ చార్జీలను ఆఫర్ చేసింది. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 31 వరకు తమ విమానాల్లో ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. అలాగే గతంలో స్పైస్‌జెట్, ప్రభుత్వరంగ ఎయర్‌లైన్స్ ఎయరిండియా కూడా టిక్కెట్ ధరలపై ఆఫర్లను ప్రకటించాయ. మధ్యతరగతి ప్రయాణికులే లక్ష్యంగా వస్తున్న ఈ ఆఫర్లు విపరీతమైన ఆదరణకు నోచుకుంటుండటంతో విమానయాన సంస్థలు కూడా మరింత ఉత్సాహంతో ఎప్పటికప్పుడు తక్కువ చార్జీలతో సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయ.ఖర్చులు పెరిగిపోవడం, ప్రయాణికుల సంఖ్య కూడా పడిపోతుండటంతో జనాభాల్లో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి విమాన సంస్థల యాజమాన్యాలు. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా చౌక టిక్కెట్ల ఆఫర్లను తీసుకొస్తోంది. ఆఫర్ టిక్కెట్ల విక్రయంలో ప్రయాణికులు ముందుగా బుక్ చేసుకుంటే విమానయాన సంస్థలు ప్రకటించిన తేదీల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. మూడు నెలల నుంచి ఆరు నెలల సమయంలో ప్రకటించిన తేదీల్లో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. దీంతో మధ్యతరగతి ప్రజానీకం కుటుంబ సమేతంగా విమానాలను ఎక్కేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా విమానయాన విధానంలో సంస్కరణలను తెస్తోంది. ఇటీవల పరిచయం చేసిన నూతన విమానయాన విధానంలో కొత్త ప్రాంతాలకు విమానాలు నడిపే సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను మోదీ సర్కారు ప్రకటించినది తెలిసిందే. అంతేగాక విదేశీ సేవల విషయంలో వివాదాస్పదమైన 5/20 నిబంధననూ తొలగించింది. ఇంతకుముందు దేశీయ విమానయాన రంగంలో ఐదేళ్ల అనుభవం, 20 విమానాలను కలిగి ఉంటేనే విదేశాలకు విమానాలను నడిపేందుకు అర్హత. అయితే ఇప్పుడు 20 విమానాలున్నా, లేదా దేశీయ విమానయాన కార్యకలాపాల్లో 20 శాతం వాటా ఉన్నా విదేశాలకు విమానాలను నడుపుకోవచ్చు. కనీస ధరను 2,500 రూపాయలకు తగ్గించింది. ఇవన్నీ కూడా విమానయానాన్ని చౌకగా మార్చడానికేనని, మరింత మందికి విమాన ప్రయాణాన్ని దగ్గరకు చేర్చాలనేనని పౌర విమానయాన కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే చెప్పారు. ఇకపోతే విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడంతో సంస్థల మధ్య పోటీ పెరిగి ప్రయాణీకులకు లాభిస్తుందన్న అభిప్రాయాలూ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి లోహ విహంగ వీక్షణం సంపన్నుల నుంచి సామాన్యుడికీ దక్కుతోంది.