బిజినెస్

రైతులకు వరం.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే కీలక పాత్ర. ఇప్పటికీ 60 శాతం జనాభా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. జాతీయాదాయంలో కూడా ఎక్కువగా వ్యవసాయం నుంచే ఆదాయం వస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా ఉంది. కానీ దేశంలో వ్యవసాయం ప్రకృతి కరుణపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. వర్షాలు పడితే దిగుబడులు ఎక్కువ ఉంటుండగా, వర్షాభావ కాలంలో తక్కువగా వస్తున్నాయి. మరోవైపు మార్కెట్‌లోకి వచ్చే నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. దీంతో రైతాంగం రుణాల బారినపడి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. రైతులు ఎదుర్కొంటున్న ఈ దుర్భర పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన బీమా విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో తాను వేసే పంటలకి రైతులకు ఊరట లభిస్తుంది. కొత్త బీమాలో చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని తగ్గించడంతోపాటు పంటల కోత తర్వాత కూడా వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. జాతీయ వ్యవసాయ బీమా పథకం, సవరించిన జాతీయ పంటల బీమా పథకాలు గ్రామం, జిల్లా యూనిట్‌గా అమలవుతున్నాయి. దానివల్ల గ్రామంలో ఒకరిద్దరు రైతులు పంట నష్టపోయినా వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే కేంద్రం కొత్తగా ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమలులో ఉన్న పథకాల స్థానంలో పిఎంఎఫ్‌బివై అమల్లోకి వచ్చింది. కాగా, ఖరీఫ్ కాలంలో సాగుచేసే ఆహార, నూనెగింజల పంటలన్నింటికీ రైతు చెల్లించాల్సిన ప్రీమియాన్ని అతి తక్కువగా ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతంగా ఉంటుంది. సాంవత్సరిక వాణిజ్య, ఉద్యానవన పంటలకు రైతు ప్రీమియం 5 శాతంగా ఉంటుంది. మిగిలిన ప్రీమయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా 50:50 మేర భరిస్తాయి. ప్రస్తుతం రైతులకు బీమా చేసిన పంట మొత్తంలో 4 నుంచి 15 శాతం వరకూ ప్రీమియంగా చెల్లిస్తున్నారు. కొత్త పంటల బీమా రైతులకు మరింత ఆర్థిక సహాయం అందించడంతోపాటు రైతులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుంది. దీంతో రైతుకు తాను వేయబోయే పంటపై భరోసా ఏర్పడుతుంది. దేశంలో 2008 నుంచి పంటల బీమా పథకాలు అమలులో వున్నా ఇప్పటివరకు 23 శాతం మంది రైతులకు మాత్రమే ఇవి వర్తిస్తున్నాయి. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ కొద్ది సంవత్సరాల్లోనే కనీసం 50 శాతం మంది రైతులకు వర్తించే లక్ష్యంతో ఈ ఖరీఫ్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో వేరుశనగ, గుంటూరు, ప్రకాశం, ప్రత్తి, గుంటూరులో మిరప, ప.గో జిల్లాలో ఆయిల్‌పామ్, కడపలో బత్తాయి, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో టమోటా పంటల సాగుకు ప్రతిపాదించారు.