బిజినెస్

మరో 14 పైసలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 8: అమెరికా డాలర్‌తో రూపాయి మారకపు విలువ పతనం కొనసాగుతునే ఉంది. శుక్రవారం 18 పైసలు పతనమైన రూపాయి సోమవారం 14 పైసలు దిగజారింది. మార్కెట్‌లో ట్రేడింగ్ మొదలైన వెంటనే, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి బలపి, దాని ప్రభావం రూపాయి మారకపు విలువపైన పడింది. ఆరంభంలో దారుణంగా దిగజారడంతో డాలర్ విలువ 74.23 రూపాయలకు దూసుకెళ్లింది. అయితే, ఆతర్వాత కొద్దిగా సర్దుకొని 73.76 రూపాయల వద్ద ముగిసింది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వివిధ దేశాలతోపాటు భారత్ మార్కెట్‌పైన కూడా ప్రభావాన్ని చూపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రిజర్వ్ రిక్వెయిర్‌మెంట్ రేషన్స్ (ఆర్‌ఆర్‌ఆర్)ను చైనా ఒక శాతం తగ్గించింది. ఈ నిర్ణయం ఈనెల 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంతో చైనా బ్యాంకింగ్ రంగంలోకి నికరంగా 109.2 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లో ఉంటుంది. అదే సమయంలో, అంతర్జాతీయ విపణిలో డాలర్ బలోపేతమైంది. ఈ కారణంగానే డాలర్‌కు రూపాయి మారకపు విలువ పతనం కొనసాగిందని ఫోరెక్స్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. గత నాలుగు సీజన్లలో భారత కేపిటల్ మార్కెట్ నుంచి విదేశీ మదుపరులు 9,300 కోట్ల రూపాయలు (సుమారు 1.3 బిలియన్ డాలర్లు) తమతమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం కూడా ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపింది. రూపాయి విలువ మరింతగా పతనమవుతున్న అనుమానంతో విదేశీ పెట్డుబడిదారులు వెనుకంజ వేస్తుండగా, విదేశాలకు వెళ్లే అవుట్ ఫ్లో పెరుగుతున్నది. ఈ పరిణామం సహజంగానే రూపాయి విలువ పతనానికి ప్రధాన కారణమవుతున్నది. తాజా త్రైమాసిక సమీక్షలో ఎవరూ ఊహించని రీతిలో ఆర్‌బీఐ వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం మార్కెట్‌ను ప్రభావితం చేసింది. మొత్తం మీద వివిధ అంశాలు రూపాయి మారక విలువను శాసించి, రికార్డు స్థాయిలో పతనానికి కారణమయ్యాయి.