బిజినెస్

జర్మనీలో భారతీయ కంపెనీలు విజయపథంలో.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 14: జర్మనీలో భారతీయ కంపెనీలు విజయపథంలో దూసుకెళుతున్నాయి. అక్కడ సుమారు డెబ్బై నాలుగుకుపైగా భారతీయ కంపెనీలు 11బిలియన్ యూరోల వార్షికాదాయాన్ని ఆర్జించాయి. అంతేకాకుండా ఆదేశంలోని 23,300 మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇటీవల ‘జర్మనీలో భారత పెట్టుబడులు’ అనే అంశంపై జరిగిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండోజర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్, సీఎల్‌ఎల్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. ప్రత్యేకించి అక్కడి నాలుగు ప్రధాన రంగాల్లో 95 శాతం ఆదాయాన్ని ఈ కంపెనీలే ఆర్జించాయని నివేదిక వెల్లడించింది. జర్మనీలో సుమారు 231కి పైగా భారతీయ కంపెనీలు వ్యాపార శాఖలను ఈ దేశంలో నిర్వహిస్తుండంగా ఇందులో 74 కంపెనీలు యేడాదికి 10 మిలియన్ యూరోల టర్నోవర్‌తో దూసుకెళుతున్నాయి. ఈ కంపెనీల సంయుక్త వార్షికాదాయం 11 బిలియన్ యూరోలుగా ఉంది. ఆటోమోటివ్స్, మెట ల్స్-ప్రాసెసింగ్, కెమికల్స్, పార్మాస్యూటికల్స్ రంగాలతోబాటు, వృత్తి, విజ్ఞాన, సాంకేతిక సేవా రంగాల్లో సైతం ఈ భారతీయ కంపెనీలు పైచేయిని సాధించాయని సర్వే నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని మొత్తం కార్మికుల్లో 59 శాతం ఈ కంపెనీల్లోనే పనిచేస్తున్నట్లు తేలింది. అద్భుతమైన వౌలిక వసతులు, ప్రతిభావంతమైన పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) విభాగాలు, నిపుణులైన కార్మికులు భారతీయ పెట్టుబడులతో కూడిన కంపెనీలకు టాప్ రేటింగ్ వచ్చేందుకు దోహదం చేశాయని నివేదిక వెల్లడించింది.