బిజినెస్

అత్యవసరం కాని వస్తువులపై దిగుమతి సుంకం లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: రూపాయి విలువ మరింత పతనం కాకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దిగుమతులపై ముఖ్యంగా అత్యవసరం కాని వస్తువులపై సుంకాన్ని కేంద్రం పెంచకపోవచ్చునని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం గడిచిన రెండు వారాల్లో గృహావసరాల వస్తువులైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టెలికాం-కమ్యూనికేషన్ సిస్టమ్‌కు సంబంధించిన వాటిపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ వచ్చిం ది. అయితే, గృహావసరాలకు అత్యవసరం కాని వస్తువు ల దిగుమతిపై ఎలాంటి సుంకం విధించే అవకాశం లేదని సంబంధిత అధికారి ఒకరు పీటీఐ ప్రతినిధికి తెలిపారు. కేంద్రం తాజాగా పెంచిన రెండో దఫా సుంకం ఈనెల 12నుంచి అమల్లోకి వచ్చింది. ఐపీ రేడియోస్, సాఫ్ట్ వాచెస్, వోయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) సామాగ్రి వంటి వస్తువులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచిన లెవీ దాదాపు 20 శాతం అమల్లోకి వచ్చింది. అదేవిధంగా మొబైల్ ఫోన్లపై విధించిన దిగుమతి సుంకం ఇప్పటికే అమల్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (ఎంఈఐటీవై) సూచనల మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం వివిధ వస్తువులపై దాదాపు 20 శాతం దిగుమతి సుంకం పెంచారు. ఇదే విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు సైతం ధృవీకరిస్తూ కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు దిగుమతి సుంకం పెంపుపై తీసుకున్న నిర్ణయం మేరకు తాము ముందుకు వెళ్తున్నామని సంబంధిత అధికారి పేర్కొన్నారు.