బిజినెస్

అంతర్జాతీయ స్థాయికి ‘ఉడాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 14: ‘ఉడే డెస్క్ కా ఆమ్ నగరిక్’ (ఉడాన్) పథకం కింద అంతర్జాతీయ విమానాల నిర్వహణకు భారత్ టెండర్లు ఆహ్వానించింది. ఈ పథకం ద్వారా విదేశాలకు సైతం విమానాలను నడపడం ద్వారా పరిథిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించాలన్న ప్రక్రియ సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో పరిధిని విస్తరించడం ద్వారానైనా సత్వర స్పందన వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈక్రమంలో విదేశాల్లోని విమానయాన సంస్థల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఈ-టెండర్లు ఆహ్వానించింది. ఉడాన్ దేశీయ విమానాల నిర్వహణ కోసం ప్రతిపాదించిన మార్గాల్లో తొలిదశలో సగం మార్గాలకు వచ్చిన టెండర్లను ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఈ విమానాల రాకపోకలను ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే టికెట్ ధరలతో ఈ విమానయాన సదుపాయం కల్పించాలన్నది ప్రభుత్వ సదుద్దేశ్యం. 2016లో ఈ ఉడాన్ పథకాన్ని ప్రకటిస్తూ గంట ప్రయాణానికి 2,500 రూపాయల సబ్సిడీ టికెట్ ధరను నిర్ణయించింది. దేశీయంగా ఉండే అన్ని ముఖ్యపట్టణాలకు ఈ పథకం ద్వారా కనెక్టివిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఐదు విమానయాన సంస్థలు 128 ప్రాంతీయ మార్గాల్లో ప్రయాణించేందుకు 2017 మార్చి నెలలో టెండర్లు దాఖలు చేశాయి. అలాగే మరో 325 ప్రాంతీయ మార్గాల్లో వివిధ చిన్న పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు చాపర్ ఆపరేషన్లు వంటివి కలిగిన 15 విమానయాన సంస్థలు రెండో దశలో 2017 జనవరి మార్చి లో టెండర్లు దాఖలు చేశాయి. ఈ దేశవాళీ వైమానిక విభాగానికి ది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. రెండో దశ టెండర్లు నవంబర్ 22లోపు ఏఏఐకి అందాల్సివుంది. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ టెండర్లను ఏఏఐ ఆహ్వానించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో ఈ ఉడాన్ పథకాన్ని అంతర్జాతీ య స్థాయికి విస్తరించాలని నిర్ణయించి ఆమేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ (ఏఏఐ) పేరిట డ్రాఫ్ట్‌ను రూపొందించింది. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం పొందిన విదేశాలకు ఈ విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా అంతర్జాతీయ విమాన టికెట్ల ఆదాయాన్ని 2027 నాటికి రూ.20 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సైతం కోరారు. 70 సీట్లకు పైగా నిర్థారిత రెక్కలతో కూడిన ఎయిర్ క్రాఫ్ట్‌లను ఈ పథకం ద్వారా నడుపుతారు. దీనికి స్పందించిన బీజేపీ పాలిత అస్సాం ఆ రాష్ట్ర రాజధాని గౌహతి నుంచి ఉడాన్ ద్వారా అంతర్జాతీయ కనెక్టివిటీని ఏర్పరచుకునేందుకు రూ. 100 కోట్లు వయ్యబులిటీ గ్యాప్ ఫండింగ్‌గా సమకూర్చేందుకు అంగీకరించింది.