బిజినెస్

పెరిగిన ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ద్రవ్యోల్బణం 5.13 శాతం పెరగడం అటు ఉత్పత్తిదారులను, ఇటు స్టాక్ మార్కెట్ మదుపరులను ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలను అనుసరించి, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.13 శాతంగా నమోదైంది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) గత ఏడాది ఆగస్టులో 4.53, సెప్టెంబర్‌లో 3.14 శాతంగా ఉంది. అప్పటితో పోలిస్తే ద్రవ్యోల్బణం ఈ ఏడాది పెరిగింది. రూపాయి మారకపు విలువ భారీగా పతనం కావడమే ఈ పరిస్థితికి కారణం. ద్రవ్యోల్బణం ఒకవైపు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తుంటే, మరోవైపు ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసరాలపై ప్రతి ద్రవ్యోల్బణ ప్రభావం కనిపిస్తున్నది. కాగా, ఈ ఏడాది జూన్ మాసంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా 5.77 శాతం నమోదైంది. దానితో పోలిస్తే, సెప్టెంబర్‌లో తగ్గిందనే చెప్పాలి. గత ఏడాది సెప్టెంబర్‌లో 3.14 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు అక్టోబర్‌లో 3.68, నవంబర్‌లో 4.02 శాతంగా నమోదైంది. డిసెంబర్‌లో 3.58 శాతం, జనవరిలో 3.02 శాతం, ఫిబ్రవరిలో 2.74 శాతం చొప్పున ద్రవ్యోల్బణ రేటు గణాంకాల్లో కనిపిస్తున్నది. మార్చిలో కూడా ఫిబ్రవరిలో మాదిరిగానే 2.74 శాతం నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల ఏప్రిల్‌లో 3.18కు చేరిన ద్రవ్యోల్బణ రేటు మేలో 4.43 శాతానికి చేరింది. జూన్ మాసంలో, గతంలో ఎన్నడూ లేని రీతిలో 5.77 శాతానికి పెరిగింది. జూలైలో పరిస్థితి కొంత మెరుగుపడగా, 5.09 శాతం నమోదైంది. ఆగస్టులో మెరుగైన పరిస్థితులు నెలకొనడంతో ద్రవ్యోల్బణం రేటు 4.53 శాతానికి పడింది. అయితే, సెప్టెంబర్‌లో 5.13 శాతంగా నమోదు కావడంతో, ఈనెలాఖరులోగా పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతున్నది.