బిజినెస్

తగ్గిన పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: బంగారం ధరలు మంగళవారం నాడు పది గ్రాములపై 70 రూపాయలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో తులం బంగారం 32,180 రూపాయల ధర పలికింది. గడచిన వారం రోజులుగా ప్రపంచ మార్కెట్ తీరుతో నెలకొన్న ఈ పరిస్థితులు వ్యాపారులను కొంత ఆందోళనకు గురిచేశాయి. అలాగే వెండి సైతం కిలోకు యాభై రూపాయలు తగ్గి 39,700 రూపాయలుగా అమ్మకాలు జరిగాయి. కాయిన్లు తయారు చేసే వారి నుంచి డిమాండ్ తగ్గడం వల్ల వెండిధర తగ్గిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో 0.07 శాతం బంగారం ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం 1,226.90 అమెరికన్ డాలర్ల పలుకగా, 0.20 శాతం తగ్గిన వెండి ధరలు సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు ధర 14.73 అమెరికన్ డాలర్లు పలికింది. మదుపర్లు అధికంగా ఈక్విటీ మార్కెట్ల వైపు మొగ్గుచూపడం కూడా ఈ పరిణామానికి కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం మేలిమి బంగారం ధర పది గ్రాములకు 32,180 పలుకగా, 99.5 శాతం మేలిమి బంగారం ధర 32,020 రూపాయలు పలికింది. గడచిన సోమవారం బంగారం ధర రూ. 200 అధికంగా ట్రేడ్ ఆయింది. సవరం (ఎనిమిది గ్రాములు) బంగారం మాత్రం స్థిరత్వాన్ని చూపుతూ 24,700 పలికింది. అలాగే వెండి నాణేలు సైతం పాత ధరతోనే ట్రేడ్ అయ్యాయి.