బిజినెస్

మార్కెట్‌ను శాసిస్తున్న ద్రవ్య లబ్ధత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్ మార్కెట్‌ను శాసిస్తున్న ప్రధాన అంశాల్లో ద్రవ్య లబ్ధత కూడా చేరింది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర, స్థూల దేశీయ ఉత్పత్తి వంటి అంశాలు కీలక పాత్ర పోషించేవి. వివిధ దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలు, అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, రష్యా, చైనా తదితర దేశాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరాటం, వాణిజ్య యుద్ధం వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించేవి. ఇప్పుడు ఆ జాబితాలో ద్రవ్య లబ్ధత కూడా చేరింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ద్రవ్య లబ్ధత చాలా తక్కువగా ఉంటున్న కారణంగా స్టాక్ మార్కెట్‌లో ఈ రంగానికి చెందిన అతి పెద్ద కంపెనీలు నష్టాల ను చవిచూస్తున్నాయి. దీనికితోడు, దేశ ఆర్థిక వ్య వస్థను తన కనుసన్నల్లో నడిపించే రిలయన్స్ ఆ ర్జించే లాభాలు, చవిచూసే నష్టాలు కూడా స్టాక్ మార్కెట్‌లో లావాదేశీలపై ప్రభావం చూపుతోంది. అయితే, ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య లబ్ధత త క్కువగా ఉండడం సెనె్సక్స్ నష్టాలకు కారణమవుతున్నది.
ద్రవ్య లబ్ధతను పెంచేందుకు ఆర్‌బీఐ పలు చర్యలను చేపడుతున్నది. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు చెందిన వాటాలనను కొనుగోలు చేస్తున్నది. అదే విధంగా చైనా సర్కారు తీసుకుంటున్న కొన్ని చర్యలు భారత స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చేవిగా ఉన్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్న కంపెనీలు తమ మిగులు నిధులను, సబ్సిడీలను నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా ఉంచేందుకు అనుమతించింది. ఈ చర్యతో లావాదేవీలు జోరందుకునే అవకాశాలున్నాయి. ఇలావుంటే, సన్ ఫార్మా, కోటక్ మహేంద్ర, వేదాంత, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్ వంటి కొన్ని సంస్థలు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో లాభపడ్డాయి. అయితే, చాలా కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఆ జాబితాలో ఎస్ బ్యాంక్ మొదటి స్థానంలో ఉంది. ఆ బ్యాంక్ షేర్లు 6.06 శాతం నష్టాన్ని చవిచూశాయి. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ 4.32, రిలయన్స్ 4.11, హీరో మోటార్స్ కార్పొరేషన్ 3.70, ఇన్ఫోసిస్ 3.11, మహీంద్ర అండ్ మహీంద్ర 2.61, టాటా మోటార్స్ 2.46, యాక్సిస్ బ్యాంక్ 2.11, మారుతీ సుజికీ 1.72, ఇండస్‌ఇండ్ 1.70 శాతం చొప్పున నష్టపోయాయి.