బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 5,005 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంగా 21శాతం నికర లాభాన్ని ఆర్జించింది. సెప్టెంబర్ మాసానికి ముగిసిన ఈ కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ మొత్తం రూ.5,005.73 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు రూ.4,151.03 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఈ బ్యాంక్ ఈ ఏడాది అదే సమయానికి మరింతగా లాభపడడం గమనార్హం. ఈ త్రైమాసికంలో మొత్తం రాబడి 21.2 శాతం పెరిగి, 23,276.20 కోట్ల రూపాయల నుంచి 28,215.20 కోట్ల రూపాయలకు చేరింది. బ్యాంకకు నికర వడ్డీ 20.6 శాతం పెరిగిందని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది.