బిజినెస్

రూ. 10,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: మదర్ డైరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) లో 10,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకుంటామన్న ఆశాభావాన్ని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డైరీ వ్యక్తం చేసింది. గురువారం ఇక్కడ సంస్థ పాల విభాగం వ్యాపారాధిపతి సందీప్ ఘోష్ విలేఖరులతో మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సంస్థ టర్నోవర్ 7,186 కోట్ల రూపాయలుగా నమోదైందన్నారు. డైరీ విభాగం నుంచే దాదాపు 75 శాతం టర్నోవర్ వస్తోందని చెప్పారు. మిగతాది తాజా పండ్లు, కూరగాయలు, వంటనూనెల ద్వారా లభిస్తోందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 8,500 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను అమ్ముతున్నామని వివరించారు. ప్రస్తుతం 40 లక్షల లీటర్ల ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని, రాబోయే 12-15 నెలల్లో మరో 7 లక్షల లీటర్ల ఉత్పత్తిని పెంచుతామన్న విశ్వాసాన్ని కనబరిచారు. కాగా, గురువారం ఇక్కడ ఆవు పాల ప్యాకెట్లను ఆవిష్కరించింది మదర్ డైరీ. 500 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్ ధర 20 రూపాయలు. త్వరలోనే 200 మిల్లీలీటర్ల ప్యాకెట్, లీటర్ ప్యాకెట్లను మార్కెట్‌లోకి తెస్తామని ఘోష్ స్పష్టం చేశారు. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి) అనుబంధ సంస్థ అయిన మదర్ డైరీ.. ప్రస్తుతం పాలు, ఐస్‌క్రీమ్, పన్నీర్, నెయ్యి వంటి పాల ఆధారిత ఉత్పత్తులను మదర్ డైరీ పేరిటనే విక్రయిస్తోంది. అయితే ‘్ధర’ బ్రాండ్‌లో వంటనూనెల వ్యాపారం, సఫల్ బ్రాండ్‌లో శీతల కూరగాయలు, ముడి పప్పు్ధన్యాలు, ఇతరత్రా ఆహార పదార్థాలను అమ్ముతోంది.