బిజినెస్

మారని ‘రూపాయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 26: రూపాయి మారకం విలువ పతనం ఏ మాత్రం తగ్గడం లేదు. అప్పుడప్పుడు మెరుగుపడుతున్నదనే ఆశలు కల్పించినప్పటికీ, పతనం కొనసాగుతునే ఉంది. శుక్రవారం మరో 20 పైసలు దిగజారింది. దీనితో డాలర్ విలువ 73.47 రూపాయలకు చేరింది. గురువారం 11 పైసలు నష్టపోయి 73.27 రూపాయలుగా ఉన్న డాలర్ రేటు మరింతగా దిగజారడం ఆందోళన కలిగించే అంశం. రూపాయి పతనం అటు స్టాక్ మార్కెట్‌పైనా, ఇటు విదేశీ పెట్టుబడులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. నష్ట నివారణ చర్యలు తాత్కాలిక ఫలితాలనే ఇస్తున్నాయి. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, రూపాయి విలువను కాపాడాల్సిన అవసరం ఉందని, లేకపోతే మార్కెట్ కోలుకోలేని రీతిలో నష్టాలను చవిచూస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.