బిజినెస్

తగ్గుతున్న ద్రవ్య లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలో ద్రవ్య లోటు గత రెండు నెలలుగా తగ్గుతున్నది. అయితే, స్థూలంగా చూస్తే మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, అంటే ఏప్రిల్‌లో 1,51,967 కోట్ల రూపాయలుగా ఉన్న ద్రవ్య లోటు మే మాసంలో మరింత పెరిగి, 1,93,526 కోట్ల రూపాయలకు చేరింది. అయితే, కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న పలు చర్యల కారణంగా, జూన్‌లో 83,540 కోట్ల రూపాయలకు తగ్గింది. జూలైలో మరోసారి పెరిగి, 1,11,224 కోట్ల రూపాయల ద్రవ్య లోటు నమోదుకాగా, ఆగస్టులో సగానికి సగం తగ్గి, 51,034 రూపాయిలైంది. సెప్టెంబర్‌లో మరింతగా తగ్గింది. కేవలం 3,441 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ పరిణామం ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు 5,91,663 కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉంటే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే 5,94,732 కోట్ల రూపాయలకు చేరింది. మిగతా ఆరు నెలల కాలంలో ద్రవ్యలోటు మరింతగా పెరగడం ఖాయం. ద్రవ్య లబ్ధత లేకపోవడంతో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అష్టాలను ఎదుర్కోవడం, ఆ కారణంగానే స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూడడం ఆనవాయితీగా మారింది. పరిస్థితి మెరుగుపడాలంటే, ద్రవ్యలోటును తగ్గించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.