బిజినెస్

కుదుటపడని గ్లోబల్ మార్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 26: గ్లోబల్ మార్కెట్ కుదుటపడని కారణంగా, భారత స్టాక్ మార్కెట్ కూడా ప్రభావితమవుతున్నది. ముడి చమురు ధర తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వివిధ అంశాలు ప్రభావితం చేయడంతో, యూరోపియన్ షేర్లు శుక్రవారం గత రెండు నెలల్లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కార్పొరేట్ దిగ్గజాల ఆదాయానికి గండి పడడం కూడా ఐరోపా షేర్ల పతనానికి ఒక కారణం. అదే పరిస్థితి ఆసియా షేర్ మార్కెట్‌లోనూ కనిపించింది. మిగతా దేశాలన్నీ నష్టాల బాటలో నడుస్తుండగా, ఆ ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) సైతం నష్టాలను ఎదుర్కొంది. మారుతి సుజికి, ఎస్ బ్యాంక్ వంటి భారీ కంపెనీల ఆదాయం నిరాశాజనకంగా కొనసాగడంతో, భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో అపనమ్మకం పెరిగింది. బ్యాంకింగేతర సంస్థలకు ద్రవ్య లబ్ధతపై నెలకొన్న గందరగోళ పరిస్థితి కారణంగా మదుపరులు వెనుకంజ వేస్తున్నారు. షేర్ మార్కెట్‌లో అమ్మకాలు పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా బీఎస్‌ఈ నష్టాలను ఎదుర్కొంది. వారంవారం గణాంకాలను పరిశీలిస్తే, సెనె్సక్స్, నిఫ్టీ వరుస పతనం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద సెనె్సక్స్ 966.32, నిఫ్టీ 273.55 పాయింట్లు నష్టపోయింది. స్థూలంగా విదేశీ పెట్టుబడిదారులు 1,495.71 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. దేశీమ మదుపరులు కొనుగోలు చేసిన షేర్ల విలువ 339.60 కోట్ల రూపాయలు. ఈ రెంటి మధ్య ఉన్న తేడా మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతుంది. జాతీయ స్టాక్ ఏక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కొన్ని సందర్భాల్లో మెరుగైన ఫలితాలను కనబరచింది. కానీ, పెరుగుదల ఎక్కువ సమయం స్తిరంగా నిలవలేదు. ఒడిదుడుకుల మధ్య కొనసాగి, నష్టాల్లోనే ముగిసింది. మధ్య, చిన్న తరహా పరిశ్రమల షేర్లు కొంత వరకూ మార్కెట్‌లో ఆశాజనకపైన వాతావరణాన్ని సృష్టించాయి. భారీ కంపెనీల షేర్ల మాదిరిగానే ఈ తరహా సంస్థల వాటాలు కూడా నష్టపోతే, స్టాక్ మార్కెట్ రికార్డు కనిష్టానికి పడిపోయి ఉండేది. ఒక రకంగా మధ్య, చిన్న తరహా పరిశ్రమల షేర్లే మార్కెట్‌ను ఆదుకున్నాయి. శుక్రవారం నాటి లావాదేవీల్లో ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, కోటక్ మహీంద్ర, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ వంటి దిగ్గజాల షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్, ప్రత్యేకించి యూరోపియన్, ఏషియన్ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతే భారత స్టాక్ మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణమని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ పరిస్థితులు ఎంత త్వరగా మెరుగుపడితే, భారత్‌కు అంత మంచిదని స్పష్టం చేస్తున్నారు.