బిజినెస్

త్రైమాసిక ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రస్తుతం, వచ్చే త్రైమాసిక ఫలితాలపై స్టాక్ మార్కెట్ పతనం ప్రభావం ఉంటుందిన ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక కాలం డిసెంబర్ 31వతేదీతో ముగుస్తుంది. రూపాయి మారకం విలువల్లో హెచ్చుతగ్గుల ప్రభావం ఈ ఫలితాలపై ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత రెండు నెలలుగా మార్కెట్ తిరోగమనంలో ఉంది. మార్కెట్లోదిద్దుబాటు చర్యలు ఎప్పుడు మొదలవుతాయో ఇప్పుడే చెప్పలేమని మార్కెట్ విశే్లషకులంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే పక్షంలో ఇనె్వస్టర్లు బాండ్లు, బంగారం కొనుగోలు చేస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసస్ రీసెర్చి హెడ్ వినోద్‌నాయర్ చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, టెక్ మహీంద్రా, అదానీ పవర్, కెనెరా బ్యాంకు, లూపిన్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, ఎన్టీపీసీ, పీఎన్‌బీల త్రైమాసిక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ సంస్థలు గత త్రైమాసిక ఫలితాల వివరాలను ఈ వారంలో విడుదల చేయనున్నాయి. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్‌లో అయోమయం నెలకొని ఉంది. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం గణనీయంగా ఉందని ఎపిక్ రీసెర్చి సీఈవో ముస్త్ఫా నడీమ్ చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు 42 శాతం మేర దిగజారాయి. గత వారంలో మార్కెట్ పతనం కావడంతో రెండవ త్రైమాసిక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.