బిజినెస్

అమ్మకానికి ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేని స్థితికి దిగజారిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్)ను పూర్తిగా విక్రయించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. 12.6 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను గట్టెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే దానిని పూర్తిగా విక్రయించాలనే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు ప్రభుత్వం నియమించిన బోర్డు ఈ సంస్థకు సంబంధించిన ఒక ప్రణాళికను బుధవారం బ్యాంక్రప్టసి కోర్టుకు సమర్పించనుంది. ఈ సంస్థ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగడానికి వీలుగా ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఇనె్వస్టర్‌కు ఈ సంస్థను విక్రయించాలనే ప్రతిపాదన కూడా ప్రణాళికలో ఉందని ఆయన వెల్లడించారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారాలను విభజించి, వాటిని పలువురు ఇనె్వస్టర్లకు విక్రయించడం అనే మరో ప్రతిపాదన కూడా ఈ ప్రణాళికలో ఉంది. దీంతో పాటు సంస్థను పూర్తిగా విక్రయించడం కాకుండా గ్రూప్ స్థాయిలో లిక్విడిటీకి వెళ్లడం అనే మరో ప్రతిపాదన కూడా ప్రణాళికలో ఉందని ఆ వ్యక్తి తెలిపారు. ప్రభుత్వం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ దివాలాకు కారణమయిన దాని బోర్డును తొలగించి, కొత్త బోర్డును నియమించినప్పటికీ, రుణాల చెల్లింపు జరగడం లేదు. ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ఇప్పుడు ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి సమస్యల్లో చిక్కుకొని ఉన్న ఈ తరుణంలో దేశంలోని క్రెడిట్ మార్కెట్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌లో నగదు కొరత సంక్షోభాన్ని పరిష్కరించడం ఎంతయినా అవసరం. ఇదిలా ఉండగా, సీరియస్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీస్ ఈ నెలలో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌లో సంక్షోభంపై దర్యాప్తు ప్రారంభించింది. ఆసియాలోనే అత్యంత సంపన్నవంతమయిన బ్యాంకర్ ఉదయ్ కోటక్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన బోర్డు ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు సంబంధించిన ప్రణాళికను బుధవారం (అక్టోబర్ 31న) నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు ఉంచనుంది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవడానికి కోర్టు ఇప్పటికే ఆమోదం తెలిపి ఉంది. దేశంలోని ఫైనాన్సియల్ మార్కెట్లను కాపాడటానికి ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను తన నియంత్రణలోకి తీసుకోవడం తప్పనిసరి అన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే, ప్రభుత్వం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను పూర్తిగా విక్రయిస్తుందా? అనే అంశంపై స్పందించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డీఎస్ మాలిక్ నిరాకరించారు.