బిజినెస్

తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: జాతీయ మార్కెట్‌లో బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం 150 రూపాయలు తగ్గడంతో, 32,630 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ ట్రేడింగ్ మండకొడిగా సాగడంతోపాటు దేశీయ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తిగి వచ్చింది. గత నెల చివరి వారంలో 32,590 రూపాయలు పలికిన పది గ్రాముల బంగారం ఆతర్వాత 32,550 రూపాయలకు పడిపోయింది. అనంతరం కోలుకొని, 32,620 రూపాయలకు చేరింది. వారం చివరి రోజున మరో 30 రూపాయలు బలపడి, 32,650 రూపాయలైంది. గురువారం 130 రూపాయలు పెరగడంతో ధర 32,780 రూపాయలకు చేరింది. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగానికి డిమాండ్, దానితోపాటు ధర పెరుగుతునే ఉంటాయని అంచనా వేశారు. కానీ, శుక్రవారం అందుకు భిన్నంగా 150 రూపాయలు పతనమై, 32,630 రూపాయలుగా నమోదైంది. అయితే, ధరలో ఈ మార్పు తాత్కాలికమేనని, పండుగ సీజన్ కావడం వల్ల ధర మళ్లీ పుంజుకుంటుందని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలావుంటే, బంగారం ధర తగ్గినప్పటికీ, దాని ప్రభావం వెండిమీద కనిపించలేదు. కిలో వెండి 390 రూపాయలు పెరిగింది. దీనితో గురువారం 39,110 రూపాయలుగా ఉన్న ధర శుక్రవారం 39,500 రూపాయలకు చేరింది.